జాతీయ వార్తలు

గురుత్వాకర్షక తరంగాలపై భారత్ అబ్జర్వేటరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్తవ్రేత్త ఆల్‌బర్ట్ ఐన్‌స్టీన్ గురుత్వాకర్షక సిద్ధాంతం రుజువైన నేపథ్యంలో ఆ దిశగా భారత్ కూడా మరో అడుగు ముందుకు వేసింది. అమెరికాలోని లీగో లేబొరేటరీతో కలిసి అత్యాధునిక రీతిలో గురుత్వాకర్షక తరంగాల అబ్జర్వేటరీని ఏర్పాటు చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ ప్రాజెక్టు వల్ల గురుత్వాకర్షక తరంగాలను మరింత క్షుణ్ణంగా, లోతుగా అధ్యయనం చేయడానికి, అదేవిధంగా ఖగోళ అధ్యయనాల్లో ముందుకు సాగడానికి భారత శాస్తవ్రేత్తలు, ఇంజనీర్లకు విస్తృత స్థాయిలో అవకాశాలు లభిస్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో లీగో-ఇండియా ప్రాజెక్టుకు అంగీకారం తెలిపారు. గురుత్వాకర్షక తరంగాలను చారిత్రక రీతిలో గుర్తించిన నేపథ్యంలో అంతరిక్షానికి సంబంధించిన ఎన్నో మిస్టరీలను ఛేదించే అవకాశాలు విస్తృతమయ్యాయి. లేజర్ ఇంటర్ ఫెర్మోమీటర్ గ్రేవిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీగా పేర్కొంటున్న లీగో-ఇండియా ప్రాజెక్టు అనేక విధాలుగా రోదసీ శోధనలో కీలకమవుతుందని భావిస్తున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 8కి.మీ పొడవైన బీమ్ ట్యూబ్ (కిరణాల ప్రవాహం) ఏర్పాటు చేస్తారు. దీని నిర్మాణంలో భారతీయ పరిశ్రమలకు ఎంతో అవకాశం ఉండడమే కాకుండా ఆధునిక టెక్నాలజీని అవపోసన పట్టే అవకాశం కూడా కలుగుతుంది. గురుత్వాకర్షక తరంగాల నిర్ధారణలో భారతీయ శాస్తవ్రేత్తలు కూడా క్రియాశీలక పాత్ర పోషించడంతో కేంద్ర ప్రభుత్వం ఈ తాజా అబ్జర్వేటరీ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది.