జాతీయ వార్తలు

చంద్రబాబు నిర్ణయం భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ప్రస్తుతం అమలులో ఉన్న రిజర్వేసన్లకు ఏమాత్రం ఇబ్బంది రాకుండా కాపులను వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చి రిజర్వేషన్లు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకుంటారన్న విశ్వాసాన్ని లోక్‌సభలో టిడిపి పక్షం నేత తోట నరసింహం వ్యక్తం చేశారు. కాపులను బిసిల జాబితాలో చేర్చి వారి అభ్యున్నతి కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాపుల జీవితాలలో కొత్త వెలుగులు ఇస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాపులను బిసిల్లో చేర్చాలని నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. పుట్టుస్వామి కమిషన్ నివేదిక సమర్పించే నాటికి ఉన్న కాపుల జనాభా ఈ మధ్యలో పెరిగి ఉంటుందని చెబుతూ రాజ్యాంగం నిర్ధేశించిన 50శాతం పరిమితి మించకుండానే ఈ రిజర్వేషన్లు అమలు జరుగుతుందని తోట చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనకున్న అపార అనుభవంతోఎవరికి నష్టం కలగని రీతిలో కాపులకు న్యాయం చేస్తారని ఆయన తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూడా కాపులను వెనుకబడిన తరగతుల జాబితాలోచేర్చటారికి తటపటాయించారన్నారు. మచిలీపట్నం ఎంపీ నారాయణ రావుమాట్లాడుతూ రిజర్వేషన్లు అనుభవిస్తున్న వారికి నష్టం కలగకుండా ప్రభుత్వం కాపురిజర్వేషన్లను అమలు చేస్తుందని చెప్పారు. శ్రీకాకుళం ఎంపీ కింజరాపురామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ సిఎం బాబు తీసుకున్న సాహసోపేత నిర్ణయం వల్ల కాపులకు న్యాయం కలుగుతుందని చెప్పారు.