జాతీయ వార్తలు

చల్లారని జాట్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్: ఒబిసి కేటగిరీలో రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో హర్యానాలో ఆందోళనకు దిగిన జాట్‌లు శనివారం మరింత రెచ్చిపోయారు. ఉద్యమాన్ని తీవ్రం చేస్తూ పెద్దఎత్తున విధ్వంసకాండకు దిగడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. మరోవైపు జాట్‌ల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని, ఆందోళన విరమించాలని హర్యానా సిఎం మనోహర్‌లాల్ ఖట్టర్ చేసిన విజ్ఞప్తిని జాట్ నేతలు తిరస్కరించారు. జాట్‌లను ఒబిసి కేటగిరీలో చేరుస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేస్తే తప్ప ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. శుక్రవారం రోహటక్, భివానీ జిల్లాల్లో కర్ఫ్యూ విధించిన అధికారులు శనివారం మరో మూడు పట్టణాలు సోనిపట్, గోహనా, జజ్జార్‌లలో కర్ఫ్యూ విధించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న ఆందోళనకారులను కట్టడి చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో కొందరు చనిపోతే, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. చండీగఢ్‌లోని పోస్ట్‌గ్రాడ్యుయేట్ వైద్య శాస్త్రాల అధ్యయన కేంద్రం (పిజిఐఎంఎస్)కు రెండు మృత దేహాలను తీసుకొచ్చారని, తీవ్రంగా గాయపడిన మరో పేషెంట్‌కు ఆపరేషన్ చేసినప్పటికీ కొద్ది నిమిషాల క్రితం చనిపోయాడని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. జజ్జార్‌లో తలకు తూటా గాయాలతో చనిపోయిన మరో వ్యక్తిని ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు ఆస్పత్రి అధికారి ఒకరు చెప్పారు. దీంతో ఇప్పటివరకు పోలీసు కాల్పుల్లో మృతిచెందిన వారి సంఖ్య 5కు చేరింది. తూటా గాయాలయిన 14 మందిని రోహ్టక్, జజ్జార్ జిల్లాలనుంచి చండీగఢ్‌లోని పిజిఐఎంఎస్‌కు తీసుకు వచ్చారని, వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని కూడా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
కాగా, జాట్‌ల డిమాండ్లను తమ ప్రభుత్వం అంగీకరించిందని, అందువల్ల ఆందోళన విరమించాలని సిఎం ఖట్టర్ ఉదయం ప్రకటన చేశారు. ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించిన తర్వాతప్రకటన వెలువడింది. జాట్ నేతలు ముఖ్యమంత్రి ప్రకటనపై స్పందిస్తూ ప్రభుత్వం కేవలం ప్రకటనలు చేస్తే సరిపోదని, జాట్‌లను ఒబిసి కేటగిరీలో చేరుస్తూ ఆర్డినెన్స్ జారీ చేస్తే తప్ప ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు. ‘ఖట్టర్ జారీ చేసే ఉత్తుత్తి ప్రకటనలను మేము అంగీకరించం. ప్రభుత్వం ముందు ఆర్డినెన్స్ జారీ చేయాలి. అసెంబ్లీలో దీనికి సంబంధించి ఒక బిల్లును ఆమోదించాలి’ అని ఆలిండియా జాట్ ఆరక్షణ్ సంఘర్ష్ సమితి జాతీయ అధ్యక్షుడు యశ్‌పాల్ మాలిక్ స్పష్టం చేశారు. అంతేకాకుండా శుక్రవారం పోలీసు కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి 50 లక్షల పరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. జాట్ యువకులు ఉద్యమ నేతల కంట్రోల్‌లో లేరంటూ వచ్చిన వార్తలపై ఆయన స్పందిస్తూ యువకులంతా కూడా నేతల కంట్రోల్‌లోనే ఉన్నారన్నారు. బిజెపి కార్యకర్తలే హింస, విధ్వంసకాండకు పాల్పడుతున్నారని కూడా ఆరోపించారు. మరోవైపు రాష్ట్ర గవర్నర్ కెప్టెన్ సింగ్ సోలంకి కూడా ఆందోళన విరమించాలని, సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని జాట్‌లకు విజ్ఞప్తి చేశారు.
జాట్‌ల ఆందోళన కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సాధారణ జనజీవనం స్తంభించి పోయింది. దుకాణాలు, వాణిజ్య సంస్థలు, స్కూళ్లు మూతపడ్డాయి. వంటగ్యాస్, పాలు, కూరగాయలులాంటి నిత్యావసర సరకుల రవాణాకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆందోళనకారులు దాదాపు ఏడు రైల్వే స్టేషన్లకు నిప్పు పెట్టడంతో 800 దాకా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆందోళనకారులు దగ్ధం చేసిన రైల్వే స్టేషన్లలో జజ్జార్, బుద్ధ ఖేడ్, జులానా, పిల్లుఖేడా ఉన్నాయని రైల్వే ప్రతినిధి ఒకరు చెప్పారు. జాట్‌ల ఆందోళన కారణంగా రద్దయిన 213 రైళ్లలో అహ్మదాబాద్ రాజధాని, జమ్మూ, రాజధాని, అమృత్‌సర్, కల్కా, చండీగఢ్, భటిండా వెళ్లే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లు, జైపూర్ ఎసి డబుల్ డెక్కర్ సర్వీసులున్నాయి. మరో 136 రైళ్లను దారి మళ్లించారని, 68 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారని ప్రతినిధి చెప్పారు. మొత్తంమీద 419 మెయిల్, ఎక్స్‌ప్రెస్ సర్వీసులపై ఆందోళన ప్రభావం ఉందని తెలిపారు. హర్యానా మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేయడంతో జమ్మూలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చిక్కుపడి పోయారు.
chitram...
రోహతక్‌లో హింసాకాండ పెచ్చరిల్లడంతో కర్ఫ్యూ ప్రాంతాల్లో కవాతు నిర్వహిస్తున్న సైన్యం