జాతీయ వార్తలు

కాశ్మీరులో ఉగ్ర‘పంజా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: జమ్మూ-కాశ్మీరులో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. పంపోర్ వద్ద శనివారం శ్రీనగర్-జమ్మూ రహదారిలో సిఆర్‌పిఎఫ్ కాన్వాయ్‌పై దాడికి పాల్పడటంతో ముగ్గురు జవాన్లు మృతిచెందారు. మరో పది మంది గాయపడ్డారు. వీరిలో ఒక సాధారణ పౌరుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాడి అనంతరం ఉగ్రవాదులు అక్కడికి సమీపంలోని ఇడిఐ (ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్)లోకి చొరబడటంతో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దీంతో అక్కడ ఇరు పక్షాల హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. అయితే అంతకుముందు స్థానిక పోలీసులు అప్రమత్తమై ఆ ప్రభుత్వ కార్యాలయం నుంచి సిబ్బందిని, సామాన్య పౌరులను ఖాళీ చేయించి ఎవరూ నిర్బంధానికి గురికాకుండా నిరోధించగలిగారని రాష్ట్ర డిజిపి కె.రాజేంద్ర పిటిఐ వార్తా సంస్థకు తెలియజేశారు. ఇదిలావుంటే, సామాన్య ప్రజలకు హాని తలపెట్టేందుకు రాలేదని ఉగ్రవాదులు చెబుతూ, తమను ఇఐడి కార్యాలయం నుంచి బయటికి వెళ్లిపోవాల్సిందిగా సూచించారని ఆ భవనం నుంచి బయటికి వచ్చిన ఒక వ్యక్తి తెలిపాడు. ప్రస్తుతం ఆ భవనంలో ఐదుగురు ఉగ్రవాదులు నక్కినట్లు ప్రత్యక్ష సాక్షులు, భద్రతా సిబ్బంది చెబుతున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో 15 కార్ప్స్ సైనిక ప్రధాన కార్యాలయం ఉంది. దీంతో అక్కడి సైనిక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రదేశానికి చేరుకుని ఉగ్రవాదుల ఏరివేతలో స్థానిక పోలీసులకు, సిఆర్‌పిఎఫ్ జవాన్లకు సాయం అందిస్తున్నారు.
chitram...
ముష్కరులు చొరబడిన జెకెఇడిఐ భవనం నుంచి బయటకు పరుగులు తీస్తున్న ప్రభుత్వ సిబ్బంది