జాతీయ వార్తలు

కేంద్ర వక్ఫ్ మండలి సభ్యుడిగా ఖాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు మహమ్మద్ అలీ ఖాన్ కేంద్ర వక్ఫ్ మండలి సభ్యుడుగా నియమితులయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్.డి.ఏ ప్రభుత్వం కేంద్ర అల్పసంఖ్యాల వర్గాల సంక్షేమ శాఖ మంత్రి అధ్యక్షతన కేంద్ర వక్ఫ్ మండలిని ఏర్పాటు చేసింది. మహమ్మద్ అలీ ఖాన్‌తోపాటు ఇరవై మంది ముస్లిం మత నాయకులు, న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులు మండలిలో సభ్యులుగా నియమితులయ్యారు. వీరు మూడు సంవత్సరాల పాటు మండలి సభ్యులుగా వ్యవహరిస్తారు.

సుబ్రహ్మణ్యస్వామికి
తగిన శాస్తి: విహెచ్

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: చౌక బారు ప్రచారం కోసం ప్రముఖలను లక్ష్యంగా పెట్టుకుని న్యాయస్థానంలో పిటీషన్లు దాఖలు చేసే భారతీయ జనతాపార్టీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామికి సుప్రీమ్ కోర్టు గుణపాఠం చెప్పిందని రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి బ్రిటీష్ పౌరసత్వం ఉందని ఆరోపిస్తూ తాను వేసిన పిటీషన్‌పై విచారించవలసిందిగా సుబ్రహ్మణ్యస్వామి చేసిన విజ్ఞప్తిని సుప్రీమ్ కోర్టు తిరస్కరిస్తూ చేసిన వ్యాఖ్యలు ఆయనకు గుణపాఠం కావాలని హనుమంతరావు చెప్పారు. న్యాయస్థానాలలోకేసు దాఖలు చేసి పత్రికలలోప్రచారం పోందటం సుబ్రహ్మణ్యస్వామికి అలవాటైపోయిందని ఆయన విమర్శించారు