జాతీయ వార్తలు

ప్రభుత్వాన్ని నిలదీద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ శనివారం పార్టీ సీనియర్ నాయకులతో సమావేశమై పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించవలసిన వ్యూహంపై సమాలోచనలు జరిపా రు. లోక్‌సభ, రాజ్యసభలో ప్రజాసమస్యలపై ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని నిలదీయాలని సోనియా పార్టీ ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. జెఎన్‌యు, రోహిత్ వేముల ఆత్మహత్య, అరుణాచల్ ప్రదేశ్ రాజకీయం, జాట్ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వాన్ని ఒక పట్టుపట్టాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. పార్లమెంటు, ముఖ్యంగా రాజ్యసభలో వివిధ ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వం ప్రతిపాదించే అన్ని బిల్లులను వ్యతిరేకించాలని కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచిస్తోంది. ‘ఇది పని చేయని ప్రభుత్వం’ అనే సందేశాన్ని పార్లమెంటు ద్వారా ప్రజలకు పంపించాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది.
స్పీకర్ అఖిల పక్ష సమావేశం
లోక్‌సభ బడ్జెట్ సమావేశాలు సజావుగా కొనసాగేలా చూసేందు కు స్పీకర్ సుమిత్రా మహాజన్ సోమవారం పార్లమెంటు ఆవరణలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు కూడా అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంటు ఉభయ సభలు సజావుగా కొనసాగేలా చూసేందుకు ప్రతిపక్షం సహకారం కోరేందుకు వెంకయ్యనాయుడు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు.

కన్హయ్య బెయిల్ పిటిషన్‌పై 23న హైకోర్టు విచారణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: దేశద్రోహం ఆరోపణల క్రింద అరెస్టయిన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యా ర్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కు మార్ దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం విచారించే అవకాశం ఉండడంతో ఆయన మరో రెండు రోజులు జైల్లోనే ఉండక తప్పేట్లు లేదు. శుక్రవారం కోర్టు రిజిస్ట్రీ పిటిషన్‌లో చూపించిన లోపాలన్నిటినీ సరిచేయడం జరిగిందని, సరయిన సాక్ష్యాధారాలు లేకుండానే నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా కన్హయ్యను తప్పుడు కేసులో ఇరికించారని లాయర్ల బృందం గట్టిగా వాదిస్తుందని ఆయన తరఫు న్యాయవాది చెప్పారు. కాగా, ఈ నెల 12న అరెస్టయిన కన్హయ్య బెయిల్‌కు మాత్రమే ఈ పిటిషన్ పరిమితమని కూడా ఆయన చెప్పారు. ఈ నెల 9న జెఎన్‌యులో ర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో తాను ఎలాంటి దేశ వ్యతిరేక నినాదాలు చేయలేదని, తనను తప్పుడు కేసులో ఇరికించారని, అందువల్ల తనకు బెయిలు మంజూ రు చేయాలని కన్హయ్య తన పిటిషన్‌లో కోరారు.
శుక్రవారం సుప్రీంకోర్టు కన్హయ్య బెయిలు పిటిషన్‌ను విచారించడానికి నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన హైకోర్టును అశ్రయించారు. శుక్రవారమే పోలీసు ఎస్కార్ట్‌తో కన్హయ్య లాయర్లు సుశీల్ బజాజ్, వృందా గ్రోవర్‌లు పాటియాలా హౌస్‌నుంచి హుటాహుటిన హైకోర్టుకు పరుగులు పెట్టి అక్కడ పిటిషన్‌ను సమర్పించారు. అయితే హైకోర్టు రిజిస్ట్రార్ ఆ పిటిషన్‌లో కొన్ని లోపాలను గుర్తించడంతో వాటిని సవరించి తిరిగి ఈ రోజు దాఖలు చేశారు.
ఫోరెన్సిక్ ల్యాబ్‌కు వీడియో
ఇదిలా ఉండగా జెఎన్‌యులో ఈ నెల జరిగిన ఓ కార్యక్రమంలో కన్హయ్య కుమార్ దేశ వ్యతిరేక నినాదాలు చేస్తున్నట్లుగా చూపిస్తున్న వీడియోను ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న జిల్లా మేజిస్ట్రేట్ (కలెక్టర్) ఫోరెన్సిక్ లేబరేటరీకి పంపించారు. ఈ వీడియోను కొన్ని న్యూస్ చానళ్లు ప్రసారం చేశాయి. సోషల్ మీడియాలో సైతం విస్తృతంగా ప్రచారం కావడం తెలిసిందే. అయితే ఆ తర్వాత మరికొన్ని న్యూస్ చానళ్లు అదే కార్యక్రమానికి సంబంధించి పూర్తి భిన్నమైన మరో వీడియోను ప్రసారం చేయడంతో ఏది అసలైనదన్న అనుమానాలు తలెత్తాయి. దీంతో ఈ వీడియోను ఫోరెన్సిక్ పరీక్షకు పంపించాలని నిర్ణయించినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
ఓ హిందీ న్యూస్ చానల్‌నుంచి సంపాదించిన వీడియో క్లిప్పింగ్ ఆధారంగా పోలీసులు కన్హయ్య కుమార్‌పై దేశద్రోహం నేరం కింద కేసు నమోదు చేశారు.