జాతీయ వార్తలు

ఆ ముగ్గురి కోసం లుక్ అవుట్ నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఢిల్లీ జెఎన్‌యులో గత వారం చోటుచేసుకున్న వివాదానికి సంబంధించి ముగ్గురు యువకుల కోసం పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. వర్శిటీలో జాతివ్యతిరేక నినాదాలు ఇచ్చినట్టు వారిపై అభియోగం నమోదైంది. ఫారిన్ రిజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసు(ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ)కు ఢిల్లీపోలీసులు సమాచారం అందించారు. ముగ్గురు యువకులు జెఎన్‌యు విద్యార్థులేనని అనుమానం వ్యక్తచేస్తున్న పోలీసులు వారి ఆచూకీ కోసం ఎయిర్‌పోర్ట్ అధికారులను అప్రమత్తం చేయాల్సిందిగా ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓను కోరారు.
ముగ్గురు యువకులు దేశం విడిచివెళ్లిపోకుండా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు. దీంతో ముగ్గురు యువకులకు సంబంధించి శుక్రవారం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. జెఎన్‌యులో జరిగిన మొత్తం వివాదానికి ఈ ముగ్గురే సూత్రధారులని పోలీసులు భావిస్తున్నారు. జాతివ్యతిరేక నినాదాలు ఇచ్చాడన్న ఆరోపణలతో జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అదృశ్యమైన విద్యార్థుల ఫోన్ నెంబర్లను, కాల్ డేటాను పోలీసులు సేకరించారు. ఇప్పుడానెంబర్లకు ఫోన్ చేస్తుంటే స్విచాఫ్ వస్తోందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. దర్యాప్తు అధికారులు ఇప్పటికే 12 మంది జెఎన్‌యు విద్యార్థుల నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. గొడవలకు కారణమైన వారి ఆచూకీ తెలుసుకోవడం కోసం ప్రత్యేక సెల్ ఒకదాన్ని ఏర్పాటు చేశారు. జెఎన్‌యు వివాదానికి సంబంధించి మొత్తం పది మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు.