జాతీయ వార్తలు

జెఎన్‌యు విద్యార్థులకు భద్రత కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు భద్రతను, గౌరవాన్ని కల్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలని బిజెపి అనుబంధ విద్యార్థి సంఘమైన ఎబివిపి (అఖిల భారత విద్యార్థి పరిషత్) మాజీ సభ్యుడు ప్రదీప్ నర్వాల్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశాడు. జెఎన్‌యు (జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ)లో చరిత్ర విద్యార్థి అయిన నర్వాల్ తమ వర్శీటీలో తలెత్తిన వివాదాన్ని కేంద్ర ప్రభుత్వం పరిష్కరించలేకపోయిందని నిరసన వ్యక్తం చేస్తూ కొద్ది రోజుల క్రితం ఎబివిపికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
‘పోలీసుల కర్తవ్యం ఏమిటి? వారున్నది ప్రజలను రక్షించేందుకా? లేక ఏదో ఒక వర్గానికి సంబంధించిన భావజాలాన్ని సమర్ధించేందుకా? ప్రజలను కాపాడేందుకా? లేక రాజకీయ పార్టీల ప్రయోజనాలను కాపాడేందుకా? ఈ వ్యవహారంలో ప్రధాని జోక్యం చేసుకుని పోలీసు వ్యవస్థ ఎటువంటి పక్షపాతం లేకుండా సక్రమంగా పనిచేసేలా చూడాలి’ అని మోదీకి రాసిన బహిరంగ లేఖలో నర్వాల్ కోరాడు. అలాగే విద్యా సంస్థల్లో రాజకీయ జోక్యానికి తావులేకుండా చూడాలని, దేశ వ్యతిరేక శక్తులకు నెలవుగా మారిందని అపఖ్యాతిని ఎదుర్కొంటున్న జెఎన్‌యుపై ఆ ముద్ర చెరిపేసి అక్కడి విద్యార్థులందరికీ భద్రతతో పాటు గౌరవాన్ని కల్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆయన ప్రధానికి విజ్ఞప్తి చేశాడు. జెఎన్‌యులో తలెత్తిన వివాదాన్ని కేంద్ర ప్రభుత్వం సరిగా పరిష్కరించలేకపోయిందని నిరసన వ్యక్తం చేస్తూ ఆ వర్శిటీలో అఖిల భారత విద్యార్థి పరిషత్ సహాయ కార్యదర్శిగా ఎన్నికైన నర్వాల్‌తో పాటు ఆ విద్యార్థి సంఘ అధ్యక్షుడు రాహుల్ యాదవ్, కార్యదర్శి అంకిత్ హన్స్ కొద్ది రోజుల క్రితం ఎబివిపికి రాజీనామా చేశారు.