జాతీయ వార్తలు

వ్యక్తిగత హాజరునుంచి సోనియా, రాహుల్‌కు మినహాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో స్థానిక కోర్టు శనివారం నేషనల్ ఇన్నోవేషన్ కౌన్సిల్ మాజీ చైర్మన్ శామ్ పిట్రోడాకు బెయిలు మంజూరు చేసింది. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఈ కేసులో వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు ఇచ్చింది.
శనివారం పిట్రోడా స్థానిక మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ లవ్‌లీన్ ఎదుట హాజరయిన తర్వాత బెయిలు మంజూరుకోసం 50 వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తు, అంతే మొత్తానికి ఒక స్యూరిటీని సమర్పించాలని ఆదేశించింది. అంతేకాకుండా ఈ కేసులో వ్యక్తిగత హాజరునుంచి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ కోశాధికారి మోతీలాల్ వోరా, గాంధీల కుటుంబ స్నేహితుడు సుమన్ దూబే, పార్టీకి చెందిన మరో నాయకుడు ఆస్కార్ ఫెర్నాండెజ్‌లకు కోర్టు మినహాయింపు ఇచ్చింది. సోనియా, రాహుల్ గాంధీలు ట్రయల్ కోర్టుకు హాజరవడం వల్ల సౌకర్యంకన్నా ఇబ్బందే ఎక్కువని వ్యాఖ్యానిస్తూ సుప్రీంకోర్టు ఈ నెల 12న ఈ ఇద్దరికీ వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా కేసు తదుపరి విచారణను కోర్టు మార్చి 21కి వాయిదా వేసింది.