జాతీయ వార్తలు

నా ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బార్‌గఢ్: కేంద్రంలో తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, తనను అప్రతిష్ఠ పాలు చేసేందుకు స్వచ్ఛంద సేవా సంస్థలు(ఎన్‌జిఓలు), బ్లాక్ మార్కెటీర్లు కుట్ర పన్నుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఈ దుష్ట శక్తులకు తల వంచుకుండా తాను ప్రజలు తనకు అప్పగించిన బాధ్యతను కొనసాగిస్తానని కూడా ఆయన స్పష్టం చేశారు. ‘ఒక ‘చాయ్‌వాలా’ ప్రధానమంత్రి కావడాన్ని కొంతమంది జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే వాళ్లు అతడ్ని గద్దె దింపడానికి అహోరాత్రులు ప్రయత్నిస్తున్నారు’ అని మోదీ అన్నారు. ఆదివారం చత్తీస్‌గఢ్‌లో పర్యటించిన అనంతరం పొరుగునే ఉన్న ఒడిశాలోని బార్‌గఢ్‌లో జరిగిన ఓ రైతు ర్యాలీలో ప్రధాని మాట్లాడారు.
తమ ప్రభుత్వం పేదలు, దళితులు, సమాజంలోని ఇతర అణగారిన వర్గాల కోసం పని చేసే ప్రభుత్వమని దేశవ్యాప్తంగా 300 గ్రామాలను అర్బన్ గ్రోత్ సెంటర్లుగా అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన ‘రూర్బన్ మిషన్’ను ప్రారంభిస్తూ మోదీ చెప్పారు.
రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రధాని వివరిస్తూ ‘ఇటీవలి కాలంలో ప్రతి రోజూ నాపై జరుగుతూ ఉండడం మీరు చూస్తూనే ఉన్నారు. కొంతమంది అయితే నిరంతరం అదే పనిలో ఉన్నారు. మోదీ ఎలా ప్రధాని అయ్యారు? ఒక చాయ్‌వాలా ఎలా ప్రధానమంత్రి అయ్యారనే విషయాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు’ అని అన్నారు. తన ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుందని, వాటి కారణంగా వీరంతా సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రధాని చెప్పారు. అయితే ఆయన వివరాలలోకి వెళ్లలేదు. గతంలోలాగా యూరియా ఎరువులు రసాయనిక ఫ్యాక్టరీలకు దారి మళ్లకుండా చేయడం కోసం యూరియాకు వేప కోటింగ్(పూత) వేయడం గురించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మేము ఈ పని చేయడం మొదలుపెట్టనప్పటినుంచి దేశాన్ని దోచుకుంటున్న ఈ కెమికల్ ఫ్యాక్టరీల వాళ్లకు కోపం రాదా? వాళ్లు నాపై మండిపడకుండా ఉంటారా?’ అని సభికులనుద్దేశించి మోదీ ప్రశ్నించారు.
స్వచ్ఛంద సేవా సంస్థలకు(ఎన్జీవోలు) విదేశాలనుంచి విరాళాలు అందుతున్నాయని ప్రధాని అంటూ, విరాళాలు వస్తే రానివ్వండి, వాటి లెక్కలు చెప్పమని తాము అడిగామని, అప్పటినుంచి అవి మోదీపై దాడి చేయడం ప్రారంభించాయని చెప్పారు. వాళ్లంతా ఒక్కటై మోదీని ఎలా ఫినిష్ చేయాలి, మోదీ ప్రభుత్వాన్ని ఎలా గద్దె దించాలి, మోదీని ఎలా అప్రతిష్ఠ పాలు చేయాలనే దానిపైనే రాత్రింబవళ్లు కుట్రలు పన్నుతున్నారని ఆయన అన్నారు. ‘అయితే దేశాన్ని ఈ రోగంనుంచి నయం చేయడం కోసమే మీరు నన్ను ఎన్నుకున్నారు. వాళ్లు ఎన్ని కుట్రలు పన్నినా సరే మీరు నాకు అప్పగించిన బాధ్యతనుంచి పక్కకు తప్పుకునే ప్రసక్తి లేదు’ అని ప్రధాని స్పష్టం చేశారు.

చిత్రం... చత్తీస్‌గఢ్‌లోని కురుబత్‌లో ఆదివారం పర్యటించి శ్యామా ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్‌ను ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. చిత్రంలో సిఎం రమణ్‌సింగ్, కేంద్ర మంత్రి హన్సరాజ్ గంగారామ్