జాతీయ వార్తలు

జాట్లదే పైచేయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ రోహతక్: హరాన్యాలో జాట్‌లు చేస్తున్న ఆందోళన సెగలు పొరుగు రాష్ట్రాలతో పాటుగా దేశ రాజధాని ఢిల్లీని సైతం చుట్టుముట్టడంతో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చాయి. రిజర్వేషన్ల అంశంపై పరిశీలనకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని నియమించేందుకు కేంద్రం అంగీకరించింది. మరోవైపు జాట్లను ఓబీసీల్లో చేర్చేందుకు హర్యానా ప్రభుత్వం హామీ ఇచ్చింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేందుకు నిర్ణయించింది. దీంతో ఆందోళనకారులు ఒక మెట్టు దిగారు. తమ ఆందోళనను పాక్షికంగా సడలించారు. జాట్ల సమ్మెతో అతలాకుతలమైన హర్యానా పరిస్థితి సోమవారంనాటికి మెరుగుపడొచ్చని భావిస్తున్నారు. గత వారం రోజులుగా జరుగుతున్న ఆందోళన ఆదివారం మరో ఇద్దరిని బలిగొంది. దీంతో ఇప్పటివరకూ మృతి చెందిన వారి సంఖ్య 12కు చేరుకుంది. ఘర్షణల్లో మరో150 మంది గాయపడ్డారు. ఆందోళనకారులు అటు రైలు మార్గాలను, ఇటు జాతీయ రహదారులను దిగ్బంధం చేయడంతో హర్యానా మీదుగా ఢిల్లీ, ఇతర పొరుగు రాష్ట్రాలకు వెళ్లే వందలాది రైళ్లు రద్దయ్యాయి. రోడ్ల దిగ్బంధం కారణంగా వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోవడంతో పాలు, కూరగాయలులాంటి నిత్యావసర ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఢిల్లీ మహానగరానికి మంచి నీటి సరఫరా సైతం నిలిచిపోవడంతో రాష్ట్రప్రభుత్వం సోమవారం పాఠశాలలు, కాలేజిలకు సెలవు ప్రకటించింది.
ఆదివారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్యానాకు చెందిన పలవురు జాట్ నేతలతో సమావేశమై వారి డిమాండ్ల గురించి తెలుసుకున్న అనంతరం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న జాట్‌ల డిమాండ్‌ను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు నేతృత్వంలో ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రాజ్‌నాథ్ విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. ఈ కమిటీ అన్ని అంశాలను పరిశీలించి వీలయినంత త్వరలో ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పిస్తుందని ఆయన చెప్పారు.
రాజ్‌నాథ్‌తో సమావేశం అనంతరం హర్యానా పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి, బిజెపి ప్రధాన కార్యదర్శి అనిల్ జైన్ విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో జాట్‌లకు ఒబిసి హోదా కల్పించడం కోసం వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఒక బిల్లును ప్రవేశపెడతారని చెప్పారు. హోంమంత్రితో జరిగిన సమావేశానికి హాజరయిన వారిలో హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలకు చెందిన జాట్ నేతలు, వ్యవసాయ మంత్రి సంజీవ్ కుమార్ బల్యాన్, హర్యానా మంత్రి ఒపి ధన్‌కర్, బిజెపి ఎంపి, ముంబయి మాజీ పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్, ఆర్మీ మాజీ డిప్యూటీ చీఫ్ రిటైర్డ్ లెఫ్టెనెంట్ జనరల్ రాజ్ కంద్యన్ తదితరులున్నారు. సమావేశం అనంతరం జాట్ సంఘర్ష్ సమితి నాయకుడు జైపాల్ సింగ్ సంగ్వాన్ విలేఖరులతో మాట్లాడుతూ చర్చలు సానూలంగా జరిగాయని, కేంద్రం తీసుకున్న నిర్ణయాలను అందరూ అంగీకరిస్తారన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు. ఆందోళన విరమించాలని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా, ఆందోళన విరమించే అంశంపై నిర్ణయాన్ని తర్వాత తీసుకుంటామని సంఘర్ష్ సమితికి చెందిన మరోనేత రాజేశ్ దహియా చెప్పారు.
ఇదిలా ఉండగా ఆదివారం కూడా హర్యానాలోని అనేక జిల్లాల్లో విధ్వంసకాండ యథావిధిగా కొనసాగింది. శనివారం పోలీసు కాల్పుల్లో గాయపడిన నలుగురు రాత్రి మృతి చెందగా, ఆదివారం మరో ఇద్దరు పోలీసు కాల్పుల్లో మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు ఈ ఆందోళనలో మృతి చెందిన వారి సంఖ్య 12కు చేరుకుంది. హర్యానా మీదుగా వెళ్లే అన్ని జాతీయ రహదారులను ఆందోళనకారులు దిగ్బంధించడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సరఫరాలు లేక పెట్రోలు బంకులు సైతం మూతపడ్డాయి. పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సైతం సెలవులు ప్రకటించారు. ఆందోళన దృష్ట్యా హర్యానా మీదుగా ఢిల్లీ, ఇతర రాష్ట్రాలకు వెళ్లే వందలాది రైళ్లను రద్దు చేయడంతో పర్యాటకులతో పాటుగా వేలాది ప్రయాణికులు చిక్కుపడి పోయారు.
ఢిల్లీ గొంతు ఎండుతోంది
హర్యానాలో జాట్ వర్గం రిజర్వేషన్ల కోసం చేపట్టిన రాస్తారోకో ఉద్యమం మూలంగా దేశ రాజధాని ఢిల్లీ ప్రజల గొంతు తడి ఆరుపోతోంది. హర్యానా నుండి ఢిల్లీకి జరగవలసిన నీటి సరఫరనా నిలిచిపోవటంతో దేశ రాజధానిలోని మంచి నీటి రిజర్వాయర్లు ఎండిపోయాయి. దీని మూలంగా గత రెండు రోజుల నుండి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరా ఆగిపోయింది. ప్రజలకు మంచినీటిని సరఫరా చేసేందుకు ట్యాంకర్లను రంగంలోకి దించుతున్నామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే హర్యానాలో శాంతి,్భద్రతలను నెలకొల్పకపోతే ఢిల్లీకి తాగునీరు సరఫరా నిలిచిపోతుందని కేజ్రివాల్ అంటున్నారు. జాట్ రిజర్వేషన్ల గొడవ మూలంగా హర్యానాలోని ములక్‌నగర్ నుండి నీటి సరఫరా నిలిపివేశారని ఆయన చెప్పారు. తాను హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు టెలిఫోన్ చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరినట్లు ఆయన వెల్లడించారు.

చిత్రం... హింసాత్మక సంఘటనలు ప్రజ్వరిల్లకుండా రోడ్లపై కవాతు నిర్వహిస్తున్న సైన్యం