జాతీయ వార్తలు

క్యాంపస్‌లోకి పోలీసులను ఎందుకు అనుమతించారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పార్లమెంట్‌పై దాడి కేసులో దోషిగా తేలిన అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ జెఎన్‌యు (జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ)లో నిర్వహించిన కార్యక్రమంపై వివాదం తలెత్తడంతో ఆ వర్శిటీ క్యాంపస్‌లోకి పోలీసులను అనుమతించాలని వైస్-చాన్సలర్ ఎం.జగదీషష్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రముఖ విద్యావేత్త నోవమ్ చోమ్‌స్కీ ప్రశ్నించారు. ‘జెఎన్‌యులో నెలకొన్న సంక్షోభం చాలా మందికి ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వమే ఈ సంక్షోభాన్ని సృష్టించినట్లు తెలుస్తోంది. జెఎన్‌యు క్యాంపస్‌లో దేశద్రోహ కార్యకలాపాలు జరిగినట్లు వర్శిటీ అధికారుల వద్ద ఎటువంటి విశ్వసనీయ సాక్ష్యాధారాలు లేవని, కనుక పోలీసులను రప్పించాల్సిన అవసరం లేదని స్పష్టమవుతోంది.
అయినప్పటికీ క్యాంపస్‌లోకి పోలీసులను ఎందుకు అనుమతించారు?’ అని చోమ్‌స్కీ ఆదివారం జెఎన్‌యు వైస్ చాన్సలర్‌కు పంపిన ఇ-మెయిల్‌లో ప్రశ్నించారు. వివాదాన్ని పరిష్కరించడంలో జెఎన్‌యు పాలనాయంత్రాంగం సరిగా వ్యవహరించలేదని ఆ వర్శిటీ విద్యార్థులు, అధ్యాపకులు నిరసన వ్యక్యం చేస్తూ, క్యాంపస్‌లో పోలీసుల ‘అణచివేత’ చర్యలకు ఎందుకు అనుమతించారని ప్రశ్నిస్తున్నారు. అయితే క్యాంపస్‌లో ప్రవేశించి విద్యార్థులను పట్టుకెళ్లాల్సిందిగా తానేమీ పోలీసులను ఆహ్వానించలేదని, చట్టపరంగా పోలీసులకు అవసరమైన సహకారాన్ని మాత్రమే అందించామని, ఈ వ్యవహారంలో తాము చేయాల్సింది, చేయగలిగింది ఇదేనని జెఎన్‌యు వైస్ చాన్సలర్ స్పష్టం చేశారు.

కన్హయ్యకు విదేశీ
వర్శిటీల మద్దతు
దేహద్రోహం కేసుకు ఖండన
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: దేశ ద్రోహం కేసులో అరెస్టయిన ఢిల్లీ జెఎన్‌యు విద్యార్థి కన్హయ్య కుమార్‌కు విదేశీ విశ్వవిద్యాలయ విద్యార్థుల నుంచి మద్దతు లభిస్తోంది. యేల్,కాలిఫోర్నియా యూనివర్శిటీ విద్యార్థులు కన్హయ్య కుమార్ ప్రసంగంలోని కొన్ని భాగాలను ఆంగ్లంలోకి అనువదించి వాటికి తమ గొంతు కలిపిన వీడియోలను ఇంటర్నెట్‌లోకి అప్‌లోడ్ చేస్తున్నారు. జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ది దేశ ద్రోహమైతే ఆ పనిచేసిన తమదీ అదే కోవకు చెందుతుంది..మమ్మల్ని అరెస్టు చేసుకోండి అంటూ వ్యాఖ్యానించారు. ‘టాక్స్ పేయర్ల సొమ్ములతోనే వర్శిటీలు నడుస్తున్నాయని కొందరు వాదిస్తున్నారు. అయితే సమాజ ఉద్ధరణకు వర్శిటీలు కృషి చేయడం లేదా?’అని లండన్ యూనివర్శిటీకి చెందిన ఎలియనొర్ న్యూబిగిన్ ప్రశ్నించారు.‘న్యాయాన్ని నిర్వచించమని ఆర్‌ఎస్‌ఎస్‌కు సవాల్ చేస్తున్నాం. స్వేచ్ఛగా, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు పరిరక్షించబడనప్పుడు వారు చెబుతున్న న్యాయంకు అర్థంలేదు’అని కాలిఫోర్నియా వర్శిటీకి చెందిన డోరాజంగ్, డమొన్ యంగ్ అన్నారు. కన్హయ్య కుమార్ ప్రసంగ సారాంశాన్ని ఆంగ్లంలోకి అనువదించి, తన గొంతుకలిపిన యేల్ వర్శిటీ విద్యార్థి గ్రేటా లాఫ్లెయిర్ మాట్లాడుతూ‘జెఎన్‌యు విద్యార్థి నేత కుమార్‌ది దేశద్రోహమే తమదీ దేశద్రోహమే అవుతుంది. మమ్మల్ని అరెస్టు చేయండి’అన్నారు.దీనిపై జరిగే చర్చలోపాల్గొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని వారు ప్రకటించారు. కాగా కొలంబియా, యేల్, హార్వర్డ్, కేంబ్రిడ్జ్ వర్శిటీలకు చెందిన 400 మందికిపైగా విద్యావేత్తలు జెఎన్‌యు విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. అనేక విదేశీ విద్యా సంస్థల విద్యార్థులు, అధ్యాపకులు కన్హయ్య కుమార్‌కు మద్దతు తెలిపారు. దేశద్రోహం కింద కేసు పెట్టడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.