జాతీయ వార్తలు

కర్నాటక సిఎం సభలో కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: నగరం లో ఆదివారం కర్నాటక ముఖ్యమం త్రి సిద్దరామయ్య, కేంద్ర మంత్రి అనంత్ కుమార్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎంఎన్ వెంకటాచలయ్య పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఒక వ్యక్తి బాంబని చెప్తూ, ఓ పాకెట్ విసిరి కలకలం సృష్టించాడు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాట్లాడడం ప్రారంభించగానే రవీంద్ర కళాక్షేత్ర ఆడిటోరియం బాల్కనీలో కూర్చుని ఉన్న ఓ వ్యక్తి హఠాత్తుగా లేచి ‘మీరు మా కులానికి ఏం చేశారు? అది ముందు చెప్పండి’ అంటూ కేకలు వేశాడు. ఆ వెంటనే బాంబని చెప్తూ వేదికపైకి ఒక పాకెట్ విసిరేశాడు.
అయితే ఆ పాకెట్ ముఖ్యమంత్రికి కాస్త దూరంగా అనంత్‌కుమార్, వెంకటాచలయ్య కూర్చుని ఉన్న చోటుకు దగ్గరగా పడింది. వేదికపై ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే ఆ పాకెట్‌ను తొలగించగా, పోలీసులు ఆ వ్యక్తిని అక్కడినుంచి బలవంతంగా తీసుకెళ్లి పోయారు. పాకెట్‌లో చాక్లెట్ పేపర్లు ఉన్నాయని, దాన్ని విసిరేసిన వ్యక్తిని ప్రశ్నిస్తున్నామని పోలీసులు చెప్పారు.
ప్రాథమిక సమాచారాన్ని బట్టి ఆ వ్యక్తిని బిఎస్ ప్రసాద్‌గా గుర్తించామని, బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బిబిఎంపి)లో అటవీ విభాగంలో పని చేస్తున్నట్లు తెలిసిందని నగర పోలీసు డిప్యూటీ కమిషనర్ సందీప్ పాటిల్ చెప్పారు. బిబిఎంపినుంచి, వ్యక్తి కుటుంబ సభ్యులనుంచి అతనికి సంబంధించిన సమాచారం సేకరిస్తున్నామని ఆయన చెప్తూ, పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆ వ్యక్తి సమాధానం చాలా చిత్రంగా ఉందన్నారు. తాను రాజ్యసభ సభ్యుడు కావాలని అనుకుంటున్నానని అందుకే అక్కడికి వచ్చానని అతను చెప్తున్నాడని ఆయన అన్నారు. కార్యక్రమం అనంతరం విలేఖరులతో మాట్లాడిన ముఖ్యమంత్రి ఈ సంఘటనకు భద్రతా లోపం కారణం కాదన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలు సాధారణమని కూడా ఆయన చెప్పారు. అతను ఏ కులానికి చెందిన వాడో తనకు తెలియదని ఆయన అంటూ, అణగారిన వర్గాల వారికోసమే తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. అంతేకాదు ఎవరైనా అతడ్ని రెచ్చగొట్టి ఉంటారని, లేకుంటే అతను అలా ప్రవర్తించి ఉండడని కూడా ముఖ్యమంత్రి అన్నారు.