జాతీయ వార్తలు

సౌత్ కరోలినాలో ట్రంప్, నెవాడాలో హిల్లరీ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబియా: అమెరికా అధ్యక్ష పదవికోసం పోటీ తీవ్రమైన నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం అందరికన్నా ముందంజలో ఉన్న వివాదాస్పద అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సౌత్ కరోలినా ప్రైమరీ ఎన్నికల్లో ప్రత్యర్థులను చిత్తు చేసి ఘన విజయం సాధించారు. మరో వైపు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ నెవాడాలో తన ప్రధాన ప్రత్యర్థి బెర్నీ శాండర్స్‌ను స్వల్ప ఆధిక్యతతో ఓడించి తన అవకాశాలను మెరుగుపర్చుకున్నారు. ఈ నెల ప్రారంభంలో న్యూహాంప్‌షైర్‌లో విజయం సాధించిన తర్వాత సౌత్ కరోలినాలో ట్రంప్ ఘన విజయం సాధించడంతో వచ్చే మంగళవారం (మార్చి 1న) 13 రాష్ట్రాల్లో జరిగే ప్రైమరీ ఓటింగ్‌కోసం మరింత ఉద్ధృతంగా ప్రచారం చేయడానికి అవసరమైన ఉత్సాహం, ఊపు లభించినట్లయింది. మరోవైపు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న ఫ్లోరిడా మాజీ గవర్నర్ జేబ్ బుష్ సౌత్ కరోలినాలో ఓటమి తర్వాత తన ప్రచారాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో అధ్యక్ష పదవికోసం పోటీ ఇప్పుడు అయిదుగురికే పరిమితమైంది. వీరి లో ట్రంప్, హిల్లరీ క్లింటన్‌లు తమ ప్రత్యర్థులకన్నా పై చేయిగా ఉండగా, మిగతా ముగ్గురిలో రిపబ్లికన్ పార్టీ తరఫున ఫ్లోరిడా సెనేటర్ మార్కో రుబియో, టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రుజ్, డెమోక్రటిక్ పార్టీ పక్షాన వెర్ట్‌నుంచి రెండుసార్లు సెనేటర్‌గా ఎన్నికయిన బెర్నీ శాండర్స్ ఉన్నారు. కాగా, సౌత్ కరోలినాలో ట్రంప్ విజయం సాధించడం డెమోక్రటిక్ పార్టీ వర్గాలను చిక్కుల్లో పడేసింది.
ఎందుకంటే 2012లో తప్ప 1980నుంచి కూడా ఈ రాష్ట్రంలో విజయం సాధించిన వ్యక్తే ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అవుతూ వస్తున్నారు. కాగా, తనను గెలిపించిన సౌత్ కరోలినా ప్రజలకు కృతజ్ఞతలు చెప్తున్నట్లు ట్రంప్ తన విజయోత్సవ ప్రసంగంలో అన్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న వారిలో ఇప్పటివరకు 32.5 శాతం ఓట్లతో ట్రంప్ అగ్రస్థానంలో ఉండగా రుబియో 22.5 శాతం, క్రుజ్ 22.3 శాతంతో రెండో స్థానంకోసం నువ్వా, నేనా అన్నట్లుగా ఉన్నారు. కాగా, నెవాడాలో హిల్లరీ క్లింటన్ తన ప్రధాన ప్రత్యర్థి శాండర్స్‌కన్నా 5 శాతం ఓట్లు అధికంగా సాధించారు. కేవలం పది రోజుల క్రితం న్యూహాంప్‌షైర్‌లో శాండర్స్ చేతిలో దాదాపు రెండంకెల తేడాతో పరాజయం పాలయిన హిల్లరీకి ఈ విజయం ఓ టానిక్ అయింది.