జాతీయ వార్తలు

ఢిల్లీలో కదం తొక్కిన మాజీ సైనికోద్యోగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు)లో దేశ వ్యతిరేక కార్యకలాపాలను ఖండిస్తూ దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో ఆదివారం భారీ నిరసన ప్రదర్శన జరిగింది. మాజీ సైనికోద్యోగుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనలో వేలాది మంది ప్రజలు కదం తొక్కారు. జెఎన్‌యులో నెలకొన్న వివాదంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్న అధికార బిజెపితో పాటు దాని మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రోద్బలంతో నిర్వహించినట్లుగా భావిస్తున్న ఈ నిరసన ప్రదర్శన జాతిపిత మహాత్మా గాంధీ సమాధి (రాజ్ ఘాట్) వద్ద నుంచి ప్రారంభమై జంతర్ మంతర్ వరకు జరిగింది. ‘జాతీయ వాదం’ కంటే ఉన్నతమైనది ఏదీ లేదంటూ ఈ ప్రదర్శనలో పాల్గొన్న పలువురు ఆందోళనకారులు దేశభక్తిని చాటుతూ నినాదాలు చేశారు. ‘్భరత్ మాతాకీ జై’, ‘వందేమాతరం’ అంటూ వారు చేసిన నినాదాలతో ఢిల్లీ వీధులన్నీ మార్మోగిపోయాయి. ‘జెఎన్‌యులో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలను ఖండిస్తూ మాజీ సైనికాధికారుల ఆధ్వర్యంలో ఆదివారం న్యూఢిల్లీలో భారీ ప్రదర్శన జరిగింది. వేలాది మంది ప్రజలు అప్పటికప్పుడు ఈ ప్రదర్శనలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు’ అని బిజెపి ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ‘ట్విట్టర్’లో పేర్కొన్నారు. మాజీ సైనికోద్యోగుల కుటుంబ సభ్యులు సహా లక్షలాది మంది ప్రజలు ఈ ప్రదర్శనలో పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారని మరో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్‌వర్గియా ‘ట్వీట్’ చేయగా, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం దేశద్రోహ చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలపై బిజెపి జాతీయ కార్యదర్శి శక్తికాంత్ శర్మ ఎదురుదాడికి దిగారు. నితీష్ కుమార్ నేతృత్వంలో జెడి(యు)-ఆర్‌జెడి-కాంగ్రె స్ కూటమి రాజ్యమేలుతున్న బిహార్‌లోనే దేశద్రోహ చట్టం కింద గత పదేళ్లలో ఎక్కువ అరెస్టులు జరిగాయని ఆయన గణాంకాలతో సహా వివరించారు.
chitram...
జెఎన్‌యులో జాతి వ్యతిరేక నినాదాలను నిరసిస్తూ ఆదివారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్ నుంచి
జంతర్ మంతర్ వరకు భారీ జాతీయ పతాకంతో ప్రదర్శన నిర్వహిస్తున్న మాజీ సైనికులు, ఇతర ప్రజలు