జాతీయ వార్తలు

2022 నాటికల్లా పేదలకు 5 కోట్ల ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నయా రాయపూర్: దేశంలో పేదలకోసం 2022 నాటికల్లా 5 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని ప్ర ధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. చత్తీస్‌గఢ్ నూతన రాజధాని నయా రాయపూర్‌లో ఆదివారం ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ నైపుణ్యం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, యువకులు ఉద్యోగాలను సృష్టించే వారుగా తయారు కావాలని అన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇనే్నళ్లు గడిచిన తర్వాత కూడా దేశంలో 5 కోట్ల మంది సొంత ఇల్లంటూ లేకుండా ఉన్నారన్నారు. వీరిలో 2 కోట్ల మంది నగరాల్లో ఉండగా, 3 కోట్ల మంది గ్రామాల్లో ఉన్నారు.
2022లో దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకొనే నాటికి తమకు ఎలాంటి భారత దేశం కావాలో ప్రతి భారతీయుడూ ఆలోచించాలని మోదీ అన్నారు. 2022 నాటికి పేదలకోసం 5 కోట్ల ఇళ్లను నిర్మించడం కోసం కేంద్రం, రాష్ట్రప్రభుత్వాలు కలిసి పని చేయాలని ప్రధాని అన్నారు. ఈ పథకం వల్ల బోలెడన్ని ఉపాధి అవకావాలు సృష్టించబడతాయి, సిమెంటు, ఇటుకలు లాంటి బిల్డింగ్ మెటీరియల్స్ అమ్మకాలు పెరుగుతాయని ఆయన చెప్పారు. ‘ఇదేదో వౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టు కాదు. పేదల కలలను సాకారం చేయడం కోసం చేపట్టిన ప్రాజెక్టు’ అని ఆయన అన్నారు.
నైపుణ్యం అభివృద్ధి కోసం చత్తీస్‌గఢ్ ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి ప్రధాని మాట్లాడుతూ, భౌగోళికపరమైన లాభాల గురించి మాట్లాడితే చాలదని, మన యువకులు ఉద్యోగాలను సృష్టించే వారు గా తయారు కావాలని అన్నారు. నైపుణ్యాభివృద్ధి వల్ల యువకులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ‘ముద్రా యోజన’ నూతన పారిశ్రయామికవేత్తలను తయారు చేయడమే కాకుండా ఇప్పుడున్న పారిశ్రామికవేత్తలు ఎదగడానికి తోడ్పడుతుందన్నారు. ఆర్థికాభివృద్ధికి కేవలం ప్రైవేటు, ప్రభుత్వ రంగాలు సరిపోవని, ప్రతి వ్యక్తీ ఒక పారిశ్రామికవేత్తగా తయారయ్యే సిబ్బంది రంగం కూడా చాలా ముఖ్యమని మోదీ చెప్పారు.

చత్తీస్‌గఢ్‌లోని నయా రాయ్‌పూర్‌లో ఆదివారం ప్రధానమంత్రి ఆవాస్
యోజన శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చిత్రంలో
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఉన్నారు