జాతీయ వార్తలు

ముగిసిన ఆపరేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని పాంపోర్‌లో దాడులకు తెగబడిన ఉగ్రవాదులను ఎట్టకేలకు ఆర్మీ బలగాలు మట్టుపెట్టాయి. సోమవారంతో ఆర్మీ ఆపరేషన్ ముగిసింది. శ్రీనగర్ నగర్ శివార్లలో శ్రీనగర్- జమ్మూ జాతీయ రహదారి పక్కనున్న ఎంటర్‌ప్రీనర్స్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఇడిఐ) భవనంలో దాక్కున్న ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చి భవనాన్ని స్వాధీనపర్చుకున్నాయి. 48 గంటలకు పైగా ఆర్మీ ఆపరేషన్ సాగింది. ఇడిఐ భవనం నుంచి లష్కర్ ఎ తోయిబా (ఎల్‌ఇటి)కి చెందిన వారిగా అనుమానిస్తున్న ముగ్గురు ఉగ్రవాదుల మృతదేహాలను సోమవారం స్వాధీనపర్చుకున్నారు.
అయితే భవనంలో ఉగ్రవాదులు ఇంకెవరూ దాక్కొని లేరనే విషయాన్ని ధ్రువీకరించుకోవడానికి సోదాలు జరుపుతున్నట్టు జిఒసి విక్టర్ ఫోర్స్ మేజర్ జనరల్ దత్తా సోమవారం ప్రకటించారు. మృతిచెందిన ముగ్గురు ఉగ్రవాదులు విదేశీయులని, ఆత్మాహుతి దళానికి చెందిన వారని తెలిపారు. ‘ఉగ్రవాదులను మట్టుపెట్టడానికి ఆదివారం రాత్రి మా ప్రణాళిక అమలు ప్రారంభించాం. ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాం’ అని మేజర్ జనరల్ దత్తా ప్రకటించారు. భద్రతా బలగాలకు సోమవారం ఎలాంటి నష్టం వాటిల్లలేదని చెప్పారు.
శనివారం సాయంత్రం సిఆర్‌పిఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరుపగా ఇద్దరు సిఆర్‌పిఎఫ్ జవాన్లు, పౌరుడు మృతి చెందగా, మరో తొమ్మిది మంది జవాన్లు గాయపడిన విషయం తెలిసిందే. అయితే మొత్తం ఎంతమంది ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారనే విషయం ఖచ్చితంగా తెలియరాలేదు. సిఆర్‌పిఎఫ్ కాన్వాయ్‌పై కాల్పులు జరిపిన అనంతరం ఉగ్రవాదులు ఇడిఐ భవనంలోకి చొరబడ్డారు. దీంతో భద్రతా బలగాలు భవనంలోని సుమారు వందమంది సిబ్బంది, విద్యార్థులను శనివారమే సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. అయితే భవనాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు అందులోకి వెళ్లడానికి ప్రయత్నించగా ఉగ్రవాదులు తీవ్రస్థాయిలో కాల్పులకు తెగబడ్డారు. చుట్టూవున్న పరిసరాలు క్షుణ్ణంగా కనపడేచోట్ల మాటువేసిన ఉగ్రవాదులు భవనంలోకి భద్రతా బలగాలు ప్రవేశించకుండా నిరోధించారు. ఈక్రమంలోనే శని, ఆదివారాల్లో ఇద్దరు కెప్టెన్ స్థాయి అధికారులు సహా ముగ్గురు పారా యూనిట్ కమెండోలు ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు.

చిత్రం... ఉగ్రవాద కాల్పుల్లో నేలకొరిగిన కెప్టెన్ తుషార్ మహాజన్,
లాన్స్‌నాయక్ ఓంప్రకాష్ మృతదేహాలను సంఘటనా ప్రాంతం నుంచి తరలిస్తున్న సైన్యం