జాతీయ వార్తలు

‘స్మార్ట్’ నిధులను దారి మళ్లించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు కేటాయించిన నిధులను ఇతర పనులకు వినియోగించడానికి వీలులేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని విషయాలను పర్యవేక్షించడం, తనిఖీ చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ‘ఇండియా స్మార్ట్ సిటీస్ మిషన్: నెక్స్ట్ స్టెప్స్’ అనే అంశంపై సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. దేశంలోని 23 మున్సిపల్ కార్పొరేషన్లకు చెందిన సీనియర్ అధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. స్మార్ట్ సిటీల ఎంపికలో ఎలాంటి రాజకీయాలు చోటు చేసుకోలేదని మంత్రి అన్నారు. అనేక బిజెపి పాలిత రాష్ట్రాలు, విఐపిలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని అనేక నగరాలకు కూడా తొలి విడతలో ఎంపికైన 20 స్మార్ట్ సిటీల జాబితాలో చోటు దక్కలేదని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టు విజయవంతానికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ‘ప్రతి నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడానికి నరేంద్ర మోదీ వద్ద అల్లాదిన్ అద్భుత దీపమేదీ లేదు. ఇందుకు ప్రజల భాగస్వామ్యం అవసరం. స్మార్ట్ సిటీలకు ముందుచూపు, కార్యాచరణ పథకం రూపొందించి, అమలు చేయగల సత్తా గల స్మార్ట్ నాయకుడు అవసరం. పరిపాలనాధికారులకు ప్రజలు సహకరించకపోతే ఒక నగరం ఆకర్షణీయంగా ఎలా తయారవుతుంది’ అని వెంకయ్య నాయుడు అన్నారు. ప్రజలు, స్థానిక సంస్థలు ప్రాజెక్టులో భాగస్వామ్యం వహించాలని ఆయన చెప్పారు. ‘పట్టణ పాలన ఇంకెంతో కాలం మూస పద్ధతిలో కొనసాగజాలదు. పై నుంచి కిందికి అనే దృక్పథంతో కాకుండా కింది నుంచి పైకి అనే దృక్పథంతో ముందుకెళ్తుంది’ అని ఆయన అన్నారు.

డాక్టరేట్
తిరస్కృతికి క్షమాపణ

వారణాసి: బనారస్ హిందూ విశ్వవిద్యాలయం తనకు గౌరవ డాక్టరేట్ డిగ్రీని ప్రదానం చేయడానికి ముందుకు రాగా, తాను సున్నితంగా తిరస్కరించానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గౌరవ డాక్టరేట్‌ను తిరస్కరించినందుకు ఆయన సోమవారం ఇక్కడ వర్శిటీ స్నాతకోత్సవంలో క్షమాపణలు చెప్పారు. యూనివర్శిటీ ఇప్పటికే తనకు ఎంతో ఇచ్చిందని, అందుకు తానే వర్శిటీకి రుణపడి ఉన్నానని ఆయన తెలిపారు. అందువల్లే తాను గౌరవ డాక్టరేట్‌ను స్వీకరించడానికి అంగీకరించలేదని ఆయన వివరించారు. బనారస్ హిందూ యూనివర్శిటి వంటి విశ్వవిద్యాలయాన్ని సందర్శించడమే ఎంతో గర్వకారణమని ఆయన అన్నారు. అయితే తనను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించాలని ప్రతిపాదించినందుకు ఆయన వర్శిటీ చాన్సలర్, వైస్ చాన్సలర్, యూనివర్శిటీకి కృతజ్ఞతలు తెలిపారు. గౌరవ డాక్టరేట్‌ను తిరస్కరించినందుకు మరోలా భావించకూడదని ఆయన కోరారు. వర్శిటీ మోదీని డాక్టర్ ఆఫ్ లాస్ (ఎల్‌ఎల్‌డి)తో సత్కరించాలని ఇదివరకే ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదనను మోదీ సున్నితంగా తిరస్కరించారు.