జాతీయ వార్తలు

మీ వాళ్లను కట్టడి చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలు విపక్షాలు ఎద్దేవా చేశాయి. ప్రభుత్వాన్ని అస్థిరపరచాల్సి అవసరం తమకు ఎంతమాత్రం లేదని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. ప్రధాని ఆత్మరక్షణలో చేసిన ఆరోపణలే తప్ప విపక్షాలకు అలాంటి చర్యలకు పాల్పడాల్సిన అవసరం లేదన్నారు. ‘ముందు మీ పార్టీ నేతలను కట్టడి చేసుకోండి’ అని ఆజాద్ ఎదురుదాడి చేశారు. ‘విద్వేష పూరిత ప్రసంగాలు, ప్రకటన చేసిన అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులపై ఏనాడైనా చర్య తీసుకున్నారా?’ అని ఆయన నిలదీశారు. కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బందుల కలిగితే అవి అధికార పార్టీ స్వయంకృతం అని ఆయన అన్నారు. వివాదాస్పద ప్రకటనలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంలో ప్రధాని మోదీ ఘోరంగా విఫలమవుతున్నారని ఆజాద్ ధ్వజమెత్తారు. సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడిన ఆజాద్ రాజీవ్‌గాంధీ హయాంలో చోటుచేసుకున్న ఓ సంఘటన గుర్తుచేశారు. ‘1988-89లో పార్టీ విధానాన్ని ఉల్లంఘించి అయోధ్య అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిపై రాజీవ్ గాంధీ వేటువేశారు’ అని ఆజాద్ స్పష్టం చేశారు. బిజెపి నేతలు అనేకసార్లు వివాదాస్పాద ప్రటనలు చేసినా నాయకత్వం అదుపుచేయలేకపోయిందని కాంగ్రెస్ నేత విమర్శించారు. దేశ వ్యాప్తంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతలకు ప్రభుత్వం చేతగానితనమే కారణమని సిపిఎం నేత సీతారామ్ ఏచూరి విరుచుకుపడ్డారు. ఏపిలో కాపు ఉద్యమం, హర్యానాలో జాట్ రిజర్వేషన్లు, గుజరాత్‌లో పటేళ్ల ఆందోళనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆయన ఆరోపించారు.