జాతీయ వార్తలు

మాది పెద్దన్న పాత్రే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పొరుగున ఉన్న నేపాల్‌ను పెద్దన్నలాగే భారత్ ఆదుకుంటుంది తప్ప, దానిపై ఆధిపత్యం చెలాయించాలన్న ఆలోచన ఎంతమాత్రం లేదని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో భారత్‌పై వచ్చిన ఆరోపణలను ఆమె తిరస్కరించారు. నేపాల్‌కు ఎలాంటి కష్టం వచ్చినా అక్కున చేర్చుకున్న దేశాలలోభారత్ ఒకటని, ఎప్పుడూ ఆ దేశానికి ఇబ్బందులు కలిగించలేదని వెల్లడించారు. నేపాల్ ప్రధాన మంత్రి కె.పి.శర్మ ఓలి నాయకత్వాన్ని ప్రశంసించిన సుష్మా స్వరాజ్, ఈ రెండు దేశాల మధ్య తరతరాలుగా అనుబంధం ఉందని వెల్లడించారు.
మేం ఎవరి పక్షమూ కాదు: ఓలి
దేశ ప్రయోజనాలు, అవసరాలే తమకు ముఖ్యమని, ఏ దేశానికి అనుకూలంగా వ్యవహరించడం అన్నది జరగదని నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలి స్పష్టం చేశారు. అందువల్ల భారత్‌కు అనుకూలమా లేక చైనాకు అనుకూలమా? అన్న ప్రశే్న అప్రస్తుతమని ఆయన చెప్పారు. నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఓలి తొలిసారి భారత్ పర్యటనకు వచ్చారు. సోమవారంనాడిక్కడ జరిగిన ఓ సదస్సులో ఆయన ప్రసంగించారు. కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నేపాల్ కొత్త రాజ్యాంగం ఆవిర్భావం తరువాత నెలకొన్న ఉద్రిక్తతలు, వాణిజ్యపరమైన సంక్షోభంపై తలెత్తిన అనుమానాలు నివృత్తి చేసుకోవాలన్నదే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. అంతేతప్ప ఏ ఒక్క దేశానికి అనుకూలం లేదా వ్యతిరేకం అన్న ప్రశే్న లేదని చెప్పారు. నేపాల్ దేశ ప్రయోజనాలు, అవసరాలు తీర్చుకోవడానికే తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని శర్మ ఓలి పునరుద్ఘాటించారు. ఈ సదస్సుకు నేపాల్ ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం హాజరైంది. భారత ప్రధాని, ఉపరాష్టప్రతి, ప్రధాన మంత్రితో తాను సమావేశమై అనేక కీలక అంశాలు చర్చించామన్నారు. సరిహద్దుల్లో నెలకొన్న సంక్షోభం, దాని పరిష్కారంపై చర్చించినట్టు ఆయన తెలిపారు. ఇరుదేశాల మధ్య నెలకొన్న అనుమానాలు నివృత్తి చేసుకోవాలని తాము భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యంలో చర్చలద్వారా సమస్యలు పరిష్కారమవుతాయన్న విశ్వాసంతోనే తాము ముందుకెళుతున్నట్టు నేపాల్ అధినేత స్పష్టం చేశారు. పొరుగుదేశాలతో స్నేహ సంబంధాలు మెరుగుపరుచుకోవాలన్నదే తమ ఉద్దేశమన్న ఓలి ‘ఈ విషయంలో మా విధానాలతో రాజీపడబోము’ అని ఆయన ఉద్ఘాటించారు. కొత్త రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ నేపాల్ మధేశీ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టింది. దీంతో భారత్ నుంచి నిత్యావసరాలు, పెట్రోలియం ఉత్పత్తులు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో పెట్రోలియం ఉత్పత్తులు, నిత్యావసర సరుకులకు చైనాపై ఆధారపడాల్సి వచ్చింది.
chitram....
ఢిల్లీలో సోమవారం జరిగిన ఒక సదస్సులో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
సుష్మా స్వరాజ్‌కు అభివాదం చేస్తున్న నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలి