జాతీయ వార్తలు

ఎఫ్‌డిఐ తెస్తే.. నివాస అనుమతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రచారంలో భాగంగా విదేశాలనుంచి వ్యాపారవేత్తల రాకను సలభతరం చేసేందుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌ఢిఐ) తీసుకు వచ్చే విదేశీయులకు దీర్ఘకాలిక వీసా లేదా రెసిడెన్సీ పర్మిట్‌ను ఇచ్చే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. దేశంలో పెట్టుబడులు పెట్టే విదేశీ వ్యాపారవేత్తలకు కృతజ్ఞతా సూచకంగా భారత దేశం వారికి దీర్ఘకాలిక వీసా లేదా రెసిడెంట్ పర్మిట్ ఇవ్వగలదా లేదా అనే అంశంపై ఆర్థాక మంత్రిత్వ శాఖ హోం మంత్రిత్వ వాఖలో విదేశీయుల విభాగానికి చెందిన అధికారులు చర్చిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒక వేళ ఈ ప్రతిపాదన గనుక అమలయితే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ఉంటుంది. ఇందుకోసం ఇప్పుడున్న నిబంధనల్లో ఏమయినా సవరణలు చేయాల్సిన అవసరం ఉంటుందా అనే అంశానికి సంబంధించి విదేశీయుల చట్టంలోని వివిధ నిబంధనలను పరిశీలించడంతో పాటుగా చర్చలు కూడా జరుగుతున్నాయని ఆ వర్గాలు తెలిపాయి. అలాంటి పెట్టుబడిదారులకు కల్పించే సదుపాయాల గురించి ఇంకా చర్చలు జరుగుతున్నాయని ఆ వర్గాలు అంటూ, భారత్‌లోకి ప్రవేశించేటప్పుడు, అలాగే దేశంలోపల ప్రయాణాలు చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఉండడం కోసం వారికి తప్పకుండా మెరుగైన సదుపాయాలే ఉంటాయని వారు తెలిపారు. ప్రస్తుతం విదేశాలనుంచి దీర్ఘకాలిక వీసాపై వచ్చే వారు దేశంలో వారు ఉండే కాలం ఆరు నెలలకు (180 రోజులు) మించని పక్షంలో వారు విదేశీయుల ప్రాంతీయ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ)లేదా విదేశీయుల రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఎఫ్‌ఆర్‌ఆర్)వద్ద రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. ఒక వేళ దేశంలో పెట్టుబడి పెట్టే విదేశీయులకు దీర్ఘకాలిక వీసా, లేదా రెసిడెస్సీ పర్మిట్ జారీ చేసిన పక్షంలో ఆరు నెలల గడువు తర్వాత కూడా అలాంటి వారు విదేశీయుల రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వద్ద రిజిస్టర్ చేసుకోవలసిన అవసరం ఉండదు.