జాతీయ వార్తలు

బాబుకు దక్కింది నలుగురే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఎన్ని ప్రలోభాలు పెట్టినా చంద్రబాబు తమ పార్టీనుంచి నలుగురు ఎమ్మెల్యేలను మాత్రమే లాక్కోగలిగారని వైకాపా అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ప్రలోభాలకు లొంగని 62 మంది ఎమ్మెల్యేలకు హ్యాట్సాఫ్ అన్నారు. పార్లమెంటు సాక్షిగా రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కోరినట్లు జగన్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రలోభాలు, పదవుల ఆశ, ఎరతో తమ పార్టీ ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటున్నారని జగన్ ఆరోపించారు. ఈ అంశాన్ని రాష్టప్రతికి వివరించానన్నారు. జగన్ మంగళవారం సాయంత్రం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. చంద్రబాబు ఎన్ని ప్రలోభాలు పెట్టినా నలుగురు ఎమ్మెల్యేలను మాత్రమే తీసుకుపోగలిగారని ఆయన చెప్పారు. భూమా నాగిరెడ్డి, ఇతర శాసన సభ్యులు మంత్రి పదవుల కోసం తెలుగుదేశం పార్టీలో చేరటం సిగ్గు చేటని దుయ్యబట్టారు. చంద్రబాబు జీవితకాలమంతా దొడ్డిదారిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తెచ్చుకుని అధికారంలో కొనసాగారని జగన్ దుయ్యబట్టారు.
‘తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక హోదా సాధనను పక్కన పెట్టింది. కేంద్రాన్ని అడగటమే మరిచిపోయింది. మేము ఢిల్లీకి వచ్చి గుర్తు చేస్తే తప్ప ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయం ఎవ్వరికీ గుర్తుకు రావటం లేదు’ అని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా అంశాన్ని మాటిమాటికీ గుర్తు చేసేందుకే తాను ఢిల్లీకి తరచూ వస్తున్నానని తెలిపారు. రాష్ట్ర సమస్యలను వివరించేందుకు ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను అప్పాయింట్‌మెంట్ అడిగామని, అయితే జాట్ రిజర్వేషన్ల సమస్య మూలంగా ఇవ్వలేదన్నారు. రాష్టప్రతిని కలిసి ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న అన్ని సమస్యల గురించి వివరించినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్ తదితర అంశాలను రాష్టప్రతికి గుర్తు చేశామన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను పూర్తి చేయవలసిందిగా కేంద్రానికి గుర్తు చేయాలని రాష్టప్రతిని కోరినట్లు జగన్‌మోహన్ రెడ్డి చెప్పారు.
గోదావరి, కృష్ణా నదులపై బోర్డులు ఏర్పాటు చేయాలని ఈ బోర్డులు ఏర్పాటు చేయనందు వలన తెలంగాణ ప్రభుత్వం పాలమూరు నుండి రంగారెడ్డి జిల్లాకు లిఫ్ట్ ద్వారా 90 టిఎంసిల నీరు తీసుకుపోయేందుకు ప్రాజెక్టు చేపడుతోందని, దీని వలన రాయలసీమకు, కృష్ణాడెల్టాకు నీరు లభించదని జగన్‌మోహన్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో కుమ్ముక్కు కావటం వల్లనే ఇలా జరుగుతోందన్నారు. గిరిజన సలహా కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమం గురించి రాష్టప్రతికి వివరించానన్నారు. కాపు ఉద్యమం సందర్భంగా జరిగిన గొడవలకు తనపై ఆరోపణలు చేయటం సిగ్గు చేటన్నారు. చంద్రబాబు తమ పార్టీపై పెట్టిన దొంగ కేసుల గురించి రాష్టప్రతికి ఫిర్యాదు చేశామన్నారు. ఈ గొడవలపై న్యాయ విచారణ లేదా సిబిఐ విచారణ జరపాలని జగన్ డిమాండ్ చేశారు.
ధర్మల్ కేంద్రాల నుండి పవర్ కొనుగోలులో 2,600 కోట్ల కుంభకోణం ఉన్నదని, దీనిపై విచారణ జరిపించాలని ప్రధానిని కోరుతానని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి వస్తే చంద్రబాబు తనపై బురద చల్లుతున్నారని, తెలుగుదేశం అనుకూల పత్రికలు కూడా తమపై ఆరోపణలు చేస్తున్నాయని ఆరోపించారు. ఇంటింటికి రెండు వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న మాట ఏమైందని ఆయన బాబును ప్రశ్నించారు. చంద్రబాబు గ్రామాలకు వెళితే ప్రజలు కొట్టేలా ఉన్నారన్నారు. 2018 నాటికి తెలుగుదేశం సభ్యులు తమ పార్టీలోకి వరుస కడతారని జగన్ జోస్యం చెప్పారు. తాను చేయగలిగింది చేస్తానని రాష్టప్రతి ప్రణబ్ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.

చిత్రం... ఢిల్లీలో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని
కలిసిన వైకాపా నేత జగన్మోహన్ రెడ్డి