జాతీయ వార్తలు

అర్థవంతమైన చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఫలప్రదంగా సాగుతాయని, నిర్మాణాత్మక చర్చ కోసం ఈ సమావేవాలను ఉపయోగించుకుంటరన్న ఆశాభావాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. మంగళవారం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు అపారంభమైన సందర్భంగా ప్రధాని మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలతో జరిపిన చర్చల సందర్భంగా ప్రతిపక్షాల్లోని కొంతమంది మిత్రులు సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించారని కూడా ఆయన చెప్పారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించాలని, లోపాలను ఎత్తిచూపించాలని ప్రధాని అంటూ, దీనివల్ల ప్రజాస్వామ్యం బలపడుతుందన్నారు. అంతేకాదు ప్రతిపక్షాలకు చేరువ కావడం కోసం తమ ప్రభుత్వం ఫార్మాటీలను సైతం ఎలా పట్టించుకోకుండా వ్యవహరించిందో కూడా ఆయన ఏకరువు పెట్టారు. ప్రతిపక్షాలకు చెందిన కొంతమంది మిత్రులతో జరిపిన పలు రకాల చర్చల సందర్భంగా వారు కొంత సానుకూల ధోరణిని ప్రదర్శించారని మోదీ చెప్తూ, ఈ పార్లమెంటు సమావేశాల్లో దాని ఫలితం ప్రజలకు కనిపిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ‘ 125 కోట్ల ప్రజల కళ్లన్నీ పార్లమెంటుపైన, రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్‌పైనే ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ స్థానం దృష్ట్యా ప్రపంచం కూడా వీటిపై దృష్టిపెడుతోంది. చాలా రోజులుగా వివిధ పార్టీలతో చర్చలు జరుగుతున్నాయి. ఫార్మాటీలకు అతీతంగా చర్చలు జరిగాయి. ముఖాముఖి చర్చలు కూడా జరిగాయి. పార్లమెంటును నిర్మాణాత్మక చర్చ కోసం ఉపయోగించుకుంటారని, దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలపైన లోతుగా చర్చ జరుగుతుందని, ఈ సమావేశాల్లో మొదటిరోజునుంచి, రాబోయే రోజుల్లో ప్రజలకు దీని ప్రభావం కనిపిస్తుందని నేను ఆశిస్తున్నాను’ అని మోదీ అన్నారు.