జాతీయ వార్తలు

ఢిల్లీలో కదం తొక్కిన విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: హైదరాబాద్ యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్థి రోహిత్ వేములకు న్యాయం చేయాలని, ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు) సంక్షోభానికి నిరసనగా దేశంలోని వివిధ విశ్వ విద్యాలయాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో ప్రదర్శన నిర్వహించారు. సెంట్రల్ ఢిల్లీలోని జండేవాలాన్‌నుంచి జంతర్‌మంతర్ దాకా సాగిన ఈ ప్రదర్శనలో హైదరాబాద్ యూనివర్శిటీ, ఉస్మానియా విశ్వ విద్యాలయంతో పాటు ఢిల్లీలోని జెఎన్‌యు, ఢిల్లీ యూనివర్శిటీ, జామియా మిలియా, అంబేద్కర్ యూనివర్శిటీ తదితర విశ్వవిద్యాలయాలకు చెందిన వందలాది విద్యార్థులు పాల్గొన్నారు. జంతర్‌మంతర్ వద్ద జరిగిన ధర్నాలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ పాల్గొని విద్యార్థులకు మద్దతు తెలిపారు. ‘జైభీమ్’లాంటి లాంటి అంబేద్కర్ అనుయాయులు చేసే నినాదాలు చేసిన విద్యార్థులు రోహిత్ ఆత్మహత్య చేసుకోవడానికి కేంద్రమే బాధ్యత వహించాలని అంటూ, అతనికి న్యాయం చేయాలని, జెఎన్‌యు విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్‌ను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రోహిత్ తల్లి రాధిక, సోదరుడు రాజా కూడా ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్‌లు తమ సిద్ధాంతాలను వ్యతిరేకించే కళాశాలలు, యూనివర్శిటీ విద్యార్థుల గొంతులను అణచివేస్తున్నాయని విద్యార్థులనుద్దేశించి చేసిన ప్రసంగంలో రాహుల్ ఆరోపించారు. వివక్ష, అణచివేతలనుంచి విద్యార్థులకు రక్షణ కల్పించడానికి ఒక చట్టం తీసుకు రావాలని ఆయన గట్టిగా కోరారు. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాన్ని వ్యతిరేకించే కాలేజి, యూనివర్శిటీ విద్యార్థుల గొంతును కేంద్రం నొక్కి వేస్తోందని రాహుల్ ఆరోపిస్తూ ఇలాంటి అణచివేతను నిరోధించే ఒక చట్టాన్ని తీసుకు రావడం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం సాగిస్తుందని చెప్పారు. ఒక్క విద్యార్థులే కాదు, ఆదివాసీలు, దళితులు ఇతర బలహీన వర్గాలను సైతం ప్రభుత్వం అణచివేస్తోందని ఆయన అన్నారు. కాగా, కేంద్రం ఈ దేశంలోని విద్యార్థులతో యుద్ధానికి దిగుతోందని కేజ్రివాల్ అంటూ, ప్రధాని మోదీ గనుక తన ధోరణి మార్చుకోక పోతే అతి త్వరలోనే యువకులు, విద్యార్థులు ఒక్కటై ఆయనకు గుణపాఠం చెప్తారన్నారు. విద్యార్థులతో గొడవ పెట్టుకోవద్దని, వాళ్లు మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తారని, అప్పుడు ఏం చేయాలో మీకు దిక్కుతోచదని తాను ఇంతకు ముందే చెప్పానని విద్యార్థుల హర్షధ్వానాల మధ్య కేజ్రివాల్ అన్నారు. జెఎన్‌యు వివాదానికి వ్యతిరేకంగా ఢిల్లీలో విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించడం వారం రోజుల్లో ఇది రెండోసారి.
chitram...
రోహిత్, జెఎన్‌యు ఘటనలకు మద్దతుగా ఢిల్లీలో మంగళవారం
భారీ ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు

జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులు నిర్వహించిన ర్యాలీనుద్దేశించి ప్రసంగిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ