జాతీయ వార్తలు

పర్యావరణ అనుమతుల పిటిషన్ మార్చి 7న విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ గ్రీన్‌ట్రిబ్యునల్‌లో దాఖలైన పిటిషన్ తదుపరి విచారణ మార్చి 7 తేదీకి వాయిదా పడింది. శ్రీమన్నారాయణ, బొలిశెట్టి సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌లను జస్టిస్ స్వతంత్ర కుమార్‌తో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం మంగళవారం విచారించింది. కేంద్ర పర్యావరణ శాఖ, రాష్ట్ర పర్యావరణ సాధికారిక సంస్థ, కాలుష్య నియంత్రణ మండలి, సిఆర్‌డిఏలు విచారణకు హాజరయ్యాయి. కౌంటర్లు దాఖలు చేయడానికి తమకు గడువుకావాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశాయి. పిటిషన్ల తరపున న్యాయవాదులు, రాజధాని అనుమతులపై దాఖలైన అన్నింటినీ మార్చి 7 తేదీన విచారణకు వస్తున్నందున ఆ రోజే ఈ పిటిషన్‌ను కూడా విచారణ జరపాలని కోరగా, సిఆర్‌డి, కాలుష్య నియంత్రణ బోర్డులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. శ్రీమన్నారాయణ, ఇఎఎస్ శర్మ దాఖలు పిటిషన్ల్‌తో పాటు బొలిశెట్టి సత్యనారాయణ పిటిషన్ కూడా మార్చి 7 తేదీనే గ్రీన్‌ట్రిబ్యునల్‌లో విచారణకు రానుంది.