జాతీయ వార్తలు

అరుణాచల్ గవర్నర్ ఏం చెప్పారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ కేంద్రానికి పంపిన నివేదికల విషయంలో కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధత తొలగిపోయంది. ఆ గవర్నర్ తమకు పంపిన నివేదికలో ఏముందన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంటులో ప్రవేశ పెట్టింది. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం పూర్తిగా కుప్పకూలిపోయిందని, రాజకీయ అనిశ్చితి కారణంగా శాంతిభద్రతల విషయంలో రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోతోందని అరుణాచల్ ప్రదేశ్ రాష్టప్రతి పాలన కిందికి రావడానికి కొద్దిరోజుల ముందు గవర్నర్ జెపి రాజ్‌ఖోవా కేంద్రానికి స్పష్టంగా తెలియజేశారు. తనపై బహిరంగ విమర్శలు, రాజ్‌భవన్‌ను తరచూ ఘెరావ్ చేయడం, అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించడం లాంటి కారణంగా తమ ప్రాణాలకు తీవ్ర ముప్పుందని తాను, తన కుటుంబ సభ్యులు భయపడుతున్నామని కూడా ఆయన రాష్టప్రతికి తెలియజేశారు. ఇది జరిగిన ఓ నెల రోజులకే రాష్ట్ర అసెంబ్లీలోని 58 మంది ఎమ్మెల్యేల్లో 31 మంది కలిఖోపుల్‌ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారని, ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారని రాజ్‌ఖోవా కేంద్రానికి రెండోసారి పంపిన ‘ప్రత్యేక నివేదిక’లో తెలియజేశారు. అంటే మెజారిటీ ఎమ్మెల్యేలు కలిఖోపుల్‌ను సభా నాయకుడిగా, కొత్త ముఖ్యమంత్రిగా సమర్థిస్తున్నారని, అందువల్ల రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికయిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీలుగా రాష్ట్రంలో రాష్టప్రతి పాలనను ఎత్తివేసే విషయాన్ని రాష్టప్రతి పరిశీలించవచ్చని ఈ నెల 16న పంపిన ఆ నివేదికలో తెలియజేశారు.
రాజకీయ అనిశ్చితి కారణంగా, అధికార కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి, దరిమిలా సంభవించిన అరాచక పరిస్థితుల కారణంగా 2015 సెప్టెంబర్-అక్టోబర్ నుంచి అభివృద్ధి, ప్రజలకు సేవలందించడం, రాష్ట్ర వనరుల నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణలాంటి రంగాల్లో అరుణాచల్ ప్రదేశ్ తీవ్రంగా దెబ్బతింటోందని గత జనవరి 15న కేంద్రానికి రాసిన తొలి లేఖలో రాజ్‌ఖోవా తెలియజేశారు. రాజ్యాంగ యంత్రాంగం ఇప్పటికే కుప్పకూలిపోయిందని కూడా ఆయన స్పష్టం చేశారు. 69 మంది సభ్యులుండే రాష్ట్ర అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి నబమ్ తుకి నేతృత్వంలోని అధికార కాంగ్రెస్ పార్టీకి కేవలం ఆయన, స్పీకర్ నబమ్ రెబియాకు కలిపి ఇంతకుముందు 42 మంది సభ్యుల మద్దతు ఉండగా ఇప్పుడు 26 మంది మద్దతు మాత్రమే ఉందని ఆ లేఖలో రాజ్‌ఖోవా తెలియజేశారు. 21 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు తుకికి వ్యతిరేకంగా బహిరంగంగా తిరుగుబాటు చేశారని కూడా రాజ్‌ఖోవా ఆ లేఖలో స్పష్టం చేశారు.
రాష్ట్రంలో రాష్టప్రతి పాలనకు కేంద్ర మంత్రివర్గం గత జనవరి 24న సిఫార్సు చేయగా, 26న రాష్టప్రతి పాలన విధించారు. ఈ నెల 17న రాష్ట్రంలో కేంద్ర పాలనను ఎత్తివేయగా, అదేరోజు రాత్రి పుల్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం తెలిసిందే. రాష్ట్రంలో రాష్టప్రతి పాలన విధింపు, ఆ తర్వాత దాన్ని ఎత్తివేస్తూ జారీ చేసిన ఉత్తర్వులతో పాటుగా గవర్నర్ పంపిన రెండు నివేదికల కాపీలను మంగళవారం పార్లమెంటు ముందుంచారు.