జాతీయ వార్తలు

కీలక అంశాల ఊసేదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సార్వత్రిక బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా మంగళవారం పార్లమెంట్‌ను ఉద్ధేశించి రాష్ట్రప్రతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగం ‘నిరాశాజనకం’గా ఉందని ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. జెఎన్‌యు (జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ)లో నెలకొన్న వివాదం, దేశద్రోహ చట్టాల దుర్వినియోగం, రిజర్వేషన్లకోసం జాట్ సామాజికవర్గ ప్రజలు కొనసాగిస్తున్న ఆందోళనలు తదితర కీలక అంశాలను రాష్టప్రతి తన ప్రసంగంలో ప్రస్తావించకుండా వౌనం వహించడంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వ విధానాలను, పథకాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ రాష్టప్రతి చేసిన ప్రసంగం ‘స్ఫూర్తిదాయకం’గా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు ప్రశంసించారు. అయితే ధరల పెరుగుదల, జెఎన్‌యులో తలెత్తిన వివాదం, జాట్ల ఆందోళన వంటి కీలక సమస్యలు మినహా మిగిలిన అన్ని అంశాలను రాష్టప్రతి ప్రసంగంలో పొందుపరిచారని, తీవ్రమైన ఈ అంశాలను పార్లమెంట్‌లో ప్రస్తావించేందుకు సవరణలను ప్రతిపాదిస్తామని సిపిఎం స్పష్టం చేసింది.
రాష్టప్రతి ప్రసంగం కేంద్ర ప్రభుత్వ విజయాల గురించే సాగిందని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య గురించి గానీ, విశ్వవిద్యాలయాల్లో ప్రస్తుతం ఏం జరుగుతోందన్న విషయాన్ని గానీ అందులో ప్రస్తావించలేదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను దేశానికి వివరిస్తూ పార్లమెంట్ ఉభయ సభలను ఉద్ధేశించి రాష్టప్రతి చేసిన ప్రసంగం ‘తీవ్ర నిరుత్సాహకరం’గా ఉందని మాజీ న్యాయ శాఖ మంత్రి, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు అశ్వనీ కుమార్ పేర్కొనగా, రాష్టప్రతి ప్రసంగంలో కొత్త విషయాలేమీ లేవని కాంగ్రెస్ పార్టీకే చెందిన మరో ఎంపీ రాజీవ్ శుక్లా అన్నారు.

అధికార, ప్రతిపక్షాలు
ఎడమొహం.. పెడమొహం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగ సమయంలో అధికార, విపక్షాల మధ్య వేడితగ్గని వాతావరణమే కనిపించింది. పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఈ పార్టీలు నేతలు ముభావంగానే కనిపించారు. గతంలో ఇలాంటి సంయుక్త సమావేశాలు జరిగినప్పుడు తొణికసలాడిన ఆహ్లాదకర వాతావరణం నేటి సమావేశంలో పూర్తిగా లోపించింది. అధికార, విపక్ష సభ్యులు ముఖ్యంగా కాంగ్రెస్ సభ్యుల మధ్య చాల అరుదుగానే పలకరింపులు జరిగాయి.
విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ వద్దకు వెళ్లి కొద్దిసేపు మాట్లాడడం తప్ప అధికార పార్టీ సభ్యులెవరూ ఈ రకమైన సయోధ్య చర్చలు జరిపిన దాఖలాలు కనిపించలేదు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో బిజెపి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన సోనియా నేటి ఈ సంయుక్త సమావేశంలో బిజెపి సీనియర్ నేత అద్వానీ, మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడ వరుసలో కూర్చున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ పక్కన కూర్చున్నారు.
సోనియాతో అద్వానీ సుదీర్ఘంగా సంభాషించడం కనిపించింది. అనంతరం సిపిఎం నాయకుడు సీతారామ్ ఏచూరి, సిపిఐ నేత డి రాజా ఇతర ప్రతిపక్ష నాయకులు సోనియా వద్దకు వచ్చి మాట్లాడారు. అలాగే పక్కపక్కనే కూర్చున్న ఆజాద్, జైట్లీలు సంభాషించుకోవడం కనిపించింది.

విపక్ష నేతలతో కలివిడిగా మోదీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు తొలి రోజు ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రతిపక్ష నేతలతో ఉల్లాసంగా మాట్లాడుతూ కనిపించారు. చతురోక్తులు విసురుతూ విపక్ష నేతలకు పేరుపేరునా పలకరించారు. సభ వాయిదా పడిన వెంటనే ప్రధాని ప్రతిపక్ష నాయకుల బెంచ్‌ల వద్దకు వచ్చి అభినందనలు తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, ఆర్‌జెడి నేత జైప్రకాశ్ యాదవ్, సిపిఎం నేత పి కరుణాకరణ్, కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గేల బెంచ్ వద్దకు వచ్చి పలకరించడం కనిపించింది.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతిపక్ష సభ్యులకు కేటాయించి సీట్లలో చివర్లో కూర్చున్నారు. తరువాత తొలి వరుసకు వచ్చారు. ప్రధాని మోదీ ఎంతో కలుపుగోలుగా వచ్చి నాయకులకు షేక్‌హ్యాండ్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేరళ కాంగ్రెస్ యూనిట్ ప్రధాని మోదీకి ఓ లేఖ అందించడం కనిపించింది. తన చాంబర్‌కు వెళ్లే ముందు ఎన్‌డిఏ మిత్రపక్షాలైన టిడిపి, శివసేన సభ్యులతో ప్రధాని కరచాలనం చేశారు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సజావుగా జరిగేలా చూడడానికి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సమక్షంలో అఖిలపక్ష సమావేశాలు జరిగాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ స్కాలర్ రోహిత్ వేముల, జెఎన్‌యులో కన్హయ్య కుమార్ అరెస్టు, జాట్‌ల రిజర్వేషన్ల ఉద్యమం అంశాలను సభలో లేవనెత్తడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి.