జాతీయ వార్తలు

జెఎన్‌యు వ్యవహారంలో ఢిల్లీ పోలీసుల యు-టర్న్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జెఎన్‌యు వివాదానికి సంబంధించిన కేసులో ఢిల్లీ పోలీసులు యు-టర్న్ తీసుకున్నారు. వర్శిటీ క్యాంపస్‌లో దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడన్న అభియోగాలతో 11 రోజుల క్రితం దేశద్రోహ నేరం కింద అరెస్టయిన జెఎన్‌యుఎస్‌యు (జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం) అధ్యక్షుడు కన్హయ్య కుమార్ బెయిలుకోసం చేసుకున్న విజ్ఞప్తిని ఢిల్లీ పోలీసులు మంగళవారం కోర్టులో తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఈ కేసుకు సంబంధించిన తాజా స్థితిగతుల నివేదికను బుధవారంలోగా సమర్పించాలని ఢిల్లీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. గత వారం సుప్రీం కోర్టు జారీచేసిన ఆదేశాల మేరకు మంగళవారం ఢిల్లీ హైకోర్టులో ఈ అంశం విచారణకు వచ్చింది. దీంతో ఢిల్లీ పోలీసుల తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఎఎస్‌జి) తుషార్ మెహతా వాదన వినిపిస్తూ, కన్నయ్య బెయిలు పిటిషన్‌ను వ్యతిరేకిస్తున్నట్లు జస్టిస్ ప్రతిభా రాణికి తెలియజేశారు. కన్హయ్య బెయిలు పిటిషన్‌ను వ్యతిరేకించబోమని ఢిల్లీ పోలీసు కమిషనర్ బి.ఎస్.బస్సీ గతంలో చెప్పిన విషయం విదితమే. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయని, అందుకే ఈ కేసులో తమ వైఖరిని మార్చుకోవాల్సి వచ్చిందని ఆయన మంగళవారం స్పష్టం చేశారు. ‘అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అందుకే ఈ వ్యవహారంలో మా వైఖరి మార్చుకోవాల్సి వచ్చింది’ అని బస్సీ సమర్ధించుకున్నారు. ఇంతకుముందు ఈ వ్యవహారంలో కొంత పశ్చాత్తాపాన్ని కనబరుస్తూ, తాను దేశ వ్యతిరేక నినాదాలను సమర్థించలేదని, వర్శిటీ క్యాంపస్‌లో శాంతికోసం విజ్ఞప్తి చేశానని చెప్పిన కన్హయ్య ప్రస్తుతం తాను అటువంటి విజ్ఞప్తి ఏదీ చేయలేదని తోసిపుచ్చాడని బస్సీ తెలిపచీరు. బెయిలుపై కన్హయ్య విడుదలైతే సాక్షులను ప్రభావితం చేసి కేసు దర్యాప్తుకు విఘాతం కలిగించడంతోపాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం కూడా ఉందని, అందుకే అతనికి బెయిలు మంజూరును వ్యతిరేకించామని బస్సీ వివరించారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో
పేపర్ ట్రయల్ ఇవిఎంలు: సిఇసి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: పోలింగ్ ప్రక్రియలో పారదర్శకతను పెంపొందించేందుకు 2019 సార్వత్రిక ఎన్నికలను పేపర్-ట్రయిల్ ఆధారిత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల ద్వారా నిర్వహించనున్నారు. మున్ముందు కాలంలో ఓటర్లకు మరింత చేరువయ్యేందుకు సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నప్పటికీ ఇంటర్నెట్ ద్వారా ఓటింగ్ నిర్వహించాలన్న అంశం ఎన్నికల కమిషన్ (ఇసి) అజెండాలో లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) నజీమ్ జైదీ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో మంగళవారం ఆయన అంతర్జాతీయ సదస్సులో ప్రసంగిస్తూ, పోలింగ్ ప్రక్రియలో గోప్యతను పరిరక్షిస్తున్నామని, అయినప్పటికీ ఎన్నికల నిర్వహణలో పూర్తిగా పేపర్ ఆడిట్ ట్రయిల్ మెషీన్లను ఉపయోగించాలని ప్రజలు డిమాండ్ చేస్తుండంతో 2019 నాటికి దేశమంతటా పేపర్ ఆడిట్ ట్రయిల్ మెషీన్లతో పోలింగ్ నిర్వహించాలని యోచిస్తున్నామని తెలిపారు. దేశంలో తదుపరి సార్వత్రిక ఎన్నికలు 2019లో జరుగనున్న విషయం తెలిసిందే. అయితే పోలింగ్ ప్రక్రియలో పారదర్శకతను పెంపొందించడంతోపాటు ఎటువంటి పొరబాటు లేకుండా తాము నిశ్చయించుకున్న అభ్యర్థికే ఓటు వేశామన్న నమ్మకాన్ని ఓటర్లకు కల్పించేందుకు ఎన్నికల కమిషన్ 2013లోనే తొలిసారి పేపర్ ఆడిట్ ట్రయిల్ మెషీన్లను ప్రవేశపెట్టింది. దీనినే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయిల్ (వివిపిఎటి) అని కూడా అంటారు. ఓటరు వివిపిఎటి ద్వారా తన ఓటు హక్కు వినియోగించుకున్న వెంటనే దానితో అనుసంధానమైన ఇవిఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్) నుంచి ప్రింట్ అవుట్ వస్తుంది. ఓటరు ఈ ప్రింట్‌ను భద్రపర్చుకుని తుది ఫలితం వెల్లడి సమయంలో ఏదైనా వివాదం ఏర్పడితే ఓట్ల లెక్కింపునకు దీనిని ఉపయోగించుకునే వీలుంటుంది.