జాతీయ వార్తలు

ఏసుక్రీస్తు తమిళ హిందువా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఏసుక్రీస్తు తమిళ హిందువని పేర్కొంటూ హిందుత్వ సిద్ధాంతకర్త వి.డి సావర్కర్ సోదరుడు రాసిన ఓ వివాదాస్పద పుస్తకం తొలుత ప్రచురణ అయిన 70 ఏళ్ళ తర్వాత ఇప్పుడు తిరిగి అవిష్కరిస్తున్నారు. వి.డి సావర్కర్ అన్న అయిన గణేశ్ సావర్కర్ రాసిన ఈ పుస్తకాన్ని హిందుత్వ సిద్ధాంతకర్త అయిన సావర్కర్ వర్ధంతి సందర్భంగా ఈ నెల 26న తిరిగి మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు స్వాతంత్య్ర వీర్ సావర్కర్ నేషనల్ మెమోరియల్ అధ్యక్షుడు రంజిత్ సావర్కర్ చెప్పారు. క్రైస్తవ మతం మొదట్లో ఒక హిందూ తెగ అని, ఏసుక్రీస్తు కాశ్మీర్‌లో మృతి చెందాడని కూడా 1946లో తొలిసారి ప్రచురించిన ఆ పుస్తకం అంటోంది. శిలువ వేసిన ఏసుక్రీస్తును ఎస్సేన్ తెగకు చెందినవారు కాపాడి హిమాలయాల్లో లభించే ఔషధ మొక్కలు, వన మూలికల సాయంతో తిరిగి బతికించారని కూడా ఆ పుస్తకం వాదిస్తోంది. యేసుక్రీస్తు పుట్టుకతో విశ్వబ్రాహ్మణుడని, క్రైస్తవ మతం, హిందూమతానికి చెందిన ఒక తెగ అని కూడా ‘క్రీస్తు పరిచయ్’ అనే ఆ పుస్తకంలో ఉంది. మరాఠీలో రాసిన ఈ పుస్తకాన్ని సావర్కర్ సోదరుల సాహిత్యాన్ని, సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి, పరిరక్షించడానికి ఏర్పాటు చేసిన ట్రస్టు సావర్కర్ నేషనల్ మెమోరియల్ తిరిగి ప్రచురిస్తోంది.
ఇప్పటి పాలస్తీనా, అరబ్ దేశాలు వాస్తవానికి ఒకప్పుడు హిందూ దేశాలని, ఏసుక్రీస్తు భారత్‌కు వచ్చి యోగా నేర్చుకున్నాడని కూడా ఆ పుస్తకంలో ఉంది. ఏసుక్రీస్తు అసలు పేరు కేశవ కృష్ణ అని, తమిళం ఆయన మాతృభాష అని, ఆయన నల్లగా ఉండేవాడని కూడా ఆ పుస్తకం వాదిస్తోంది. కాగా, ఈ పుస్తకంలోని వాదనల గురించి బొంబాయి ఆర్చ్‌డియోసెసన్ హెరిటేజ్ మ్యూజియం డైరెక్టర్ ఫాదర్ వార్నర్ డిసౌజాను ప్రశ్నించగా, కోట్లాది క్రైస్తవుల నమ్మకాన్ని అలాంటి పుస్తకాలు ఎంతమాత్రం కదిలించలేవని ఆయన అన్నారు.

కాశ్మీర్ వర్శిటీకి జెఎన్‌యు సెగ!

శ్రీనగర్, ఫిబ్రవరి 23: ఢిల్లీ జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌కు కాశ్మీర్ యూనివర్శిటీ విద్యార్థులు మద్దతు తెలిపారు. జెఎన్‌యులో అఫ్జల్‌గురు సంస్మరణ సభలో జాతి వ్యతిరేక నినాదాలు ఇచ్చారన్న ఆరోపణలపై కన్హయ్య కుమార్‌ను దేశ ద్రోహం కింద అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం కాశ్మీర్ యూనివర్శిటీలో కన్హయ్యకుమార్ అరెస్టును నిరసిస్తూ విద్యార్థులు నినాదాలు చేశారు. ‘తుమ్ కిత్నే కన్హయ్య పార్‌దొగే, హర్ ఘర్ సే కన్హయ్య నికలేగే’ అంటూ నినదించారు. ఇలా ఉండగా జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య, మరో 8 మంది విద్యార్థుల జాతి వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించి ఆధారాలు ఢిల్లీ పోలీసులకు లభించాయి. అంతరంగిక విచారణలో తాజాగా ఈ వివరాలు వెల్లడైనట్టు తెలిసింది. వారంతా రాజ్యాంగ వ్యతిరేక నినాదాలు ఇచ్చినట్టు విచారణ కమిటీ పేర్కొంది. మరోపక్క బెయిల్‌కోసం కన్హయ్య కుమార్ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లగా తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది.
కాశ్మీర్ యూనివర్శిటీలో మంగళవారం కన్హయ్యకు మద్దతుగా ధర్నా చేస్తున్న విద్యార్థులు

అమర జవాన్లకు పార్లమెంట్ నివాళి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ఉగ్రవాదుల దాడుల్లోనూ, దేశ సరిహద్దుల వద్ద అసువులు బాసిన వీర జవాన్లకు పార్లమెంటు ఘన నివాళి అర్పించింది. ఉభయ సభలనుద్దేశించి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగంతో మంగళవారం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ వీర జవాన్లకు నివాళులర్పించారు. పఠాన్‌కోట్ దాడిలో మరణించిన ఏడుగురు సైనికులకు నివాళులర్పించిన ఆయన, ఈ దాడి అత్యంత హేయమైన చర్య అనీ, ఇలాంటి ఘటనలకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో ఖండించాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
కాగా, పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన ప్రతిసారీ అమర జవాన్లకు నివాళులర్పించాలని వారం రోజుల క్రితం ఉత్తరాఖండ్‌కు చెందిన బిజెపి ఎంపి తరుణ్ విజయ్ పిలుపునిచ్చారు. అయితే పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పుడల్లా అంతకుముందు మరణించిన జాతీయ నేతలకు, ఎంపీలకు, విపత్తుల కారణంగా మరణించిన వారికి నివాళులర్పించడం రివాజు. వారితో పాటు దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్లకు కూడా నివాళులర్పించాలనీ, వారి సేవలను గుర్తించాలన్న తరుణ్ విజయ్ డిమాండ్ చేస్తున్నారు. గత శీతాకాల సమావేశాల్లోనూ తరుణ్ విజయ్ ఈ అంశాన్ని లేవనెత్తడంతో పలు పార్టీలనుంచి మద్దతు లభించింది. మంగళవారం బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఇటీవల మరణించిన రాజ్యసభ సభ్యులకు చైర్మన్ నివాళులర్పిస్తున్న సమయంలో సైతం అమర జవాన్లకు నివాళులర్పించాలన్న అంశాన్ని మరోసారి లేవనెత్తారు. దీంతో సంతాపాలు తెలిపే సమయంలో చైర్మన్ అన్సారీ వీరజవాన్లకు కూడా నివాళులర్పించారు. లడఖ్‌లో సంభవించిన హిమపాతంలో మరణించిన మెడ్రాస్ రెజిమెంట్‌కు చెందిన ఎనిమిదిమంది జవాన్లకు అన్సారీ నివాళులర్పించారు. 35 అడుగుల లోతులో మంచులో కూరుకుపోయి ఆరు రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడి అనంతరం ఆర్మీ ఆస్పత్రిలో మరణించిన హనుమంతప్పకు కూడా రాజ్యసభ నివాళులర్పించింది. అంతర్జాతీయ సరిహద్దు వద్ద దేశ రక్షణలో మరణించిన సైనికుల త్యాగాలను జాతి మరువదని అన్సారీ పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులు రెండు నిమిషాలు వౌనం పాటించి అమర జవాన్లకు నివాళులర్పించారు. ఇటీవల మరణించిన రాజ్యసభ మాజీ సభ్యులు, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తి మహమ్మద్ సరుూద్, లోక్‌సభ మాజీ స్పీకర్ బలరాం జాఖడ్, సిపిఐ జనరల్ సెక్రటరీ ఎ.బి. బర్దన్, మాజీ జర్నలిస్టు, ఎంపి కపిల్ వర్మ, ఎం శంకరలింగం, మృణాళినీ సారాభాయ్‌లకు రాజ్యసభ నివాళులర్పించింది.
లోక్‌సభలోనూ అమర జవాన్లకు నివాళులర్పించారు. పఠాన్‌కోట్‌పై దాడి పిరికిపంద చర్యగా అభివర్ణించిన స్పీకర్ సుమిత్రా మహాజన్, ఈ దాడిలో ప్రాణత్యాగం చేసిన జవాన్లకు నివాళులర్పించారు. సియాచిన్ హిమపాతం కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు సైతం లోక్‌సభ నివాళులర్పించింది.

పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించేందుకు గుర్రపు బగ్గీలో వచ్చిన రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ.
సోనియా, మన్మోహన్ సింగ్‌లతో కలిసి కూర్చుని రాష్టప్రతి ప్రసంగం వింటున్న బిజెపి సీనియర్ నేత అద్వానీ