జాతీయ వార్తలు

అన్యాయం చేయొద్దు బాబుకు బుడగ జంగాల వినతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ఆంధ్రప్రదేశ్‌లోని బేడ (బుడగ) జంగం కులస్థులను షెడ్యూల్డు కులాల జాబితాలోని 9వ నంబర్‌లోనే కొనసాగించాలని అఖిల భారత బేడ, జంగమ కుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆలేటి మల్లయ్య ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. తమ కులస్థులను షెడ్యూల్డు కులాల జాబితా నుంచి తొలగించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే జరిగితే అత్యంత వెనుకబడిన వర్గమైన తమకు తీరని అన్యాయం జరుగుతుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం బేడ, జంగం కులాలకు ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తోందని మంగళవారంనాడొక ప్రకటనలో స్పష్టం చేశారు. ఏపిలో మాత్రం తమ కులానికి నష్టం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆరోపించారు.
బేడ, జంగం కులం వారికి రాజకీయ, విద్యాపరమైన ప్రయోజనాలను కల్పించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

పొగరహిత గ్రామంగా
కనె్నగంటివారిపాలెం
గుంటూరు, ఫిబ్రవరి 23: గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం, కనె్నగంటివారిపాలెం గ్రామం తొలి పొగ రహిత గ్రామంగా ఎంపికైంది. ఈ గ్రామంలో ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఉండటం వలన ఏ ఒక్కరూ పొగ వచ్చే పొయ్యిలను ఉపయోగించడం లేదు. ఈ మేరకు గ్రామ పంచాయతీ కూడా తమ గ్రామంలో పొగ వచ్చే పొయ్యిలు లేవని తీర్మానం చేయగా మండల అభివృద్ధి అధికారి గుమ్మడి సాంబశివరావు ధ్రువీకరించారు. ఈ గ్రామానికి గ్యాస్ ఏజన్సీ నిర్వాహకులుగా ఉన్న జ్యోతి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు యడ్ల సునీల్‌కు మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీ్ధర్, జిల్లా పౌరసరఫరాల అధికారి చిట్టిబాబు ప్రశంసాపత్రాలు అందజేశారు. అందరికీ గ్యాస్ మంజూరు చేయాలనే ముఖ్యమంత్రి లక్ష్య సాధనకు అధికారులందరూ నిరంతరం కృషి చేస్తున్నారని జెసి తెలిపారు.

పటేళ్లపై కదిలిన గుజరాత్
జాట్ల ఆందోళనతో రాజీబాట?
సూరత్, ఫిబ్రవరి 23: రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తూ హర్యానాలో జాట్ సామాజికవర్గ ప్రజలు సాగిస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారడం గుజరాత్ ప్రభుత్వానికి మేల్కొలుపుగా పరిణమించినట్లు కనిపిస్తోంది. రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ గుజరాత్‌లో పటేల్ సామాజికవర్గ ప్రజలు చాలా కాలం నుంచి ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉద్యమానికి సారథిగా వ్యవహరిస్తూ ప్రస్తుతం జైలులో ఉన్న హార్దిక్ పటేల్‌తో మాట్లాడి దీర్ఘ కాలం నుంచి నలుగుతున్న ఈ సమస్యను పరిష్కరించేందుకు గుజరాత్ ప్రభుత్వం మంగళవారం నాడు పటేల్ సామాజిక వర్గానికే చెందిన ప్రముఖ నాయకుడు, బిజెపి ఎంపీ విఠల్ రాడాడియాను తమ దూతగా పంపింది. దీంతో రాడాడియా లాజ్‌పోర్ జైలులో హార్దిక్ పటేల్‌ను కలసి చర్చలు జరిపారు. అనంతరం రాడాడియా మాట్లాడుతూ, రిజర్వేషన్ల విషయమై ఒప్పందం కుదిరితే హార్దిక్ పటేల్‌తో పాటు పటేల్ సామాజిక వర్గానికి చెందిన ఇతర నాయకులపై నమోదైన దేశద్రోహ కేసులను, ఇతర కేసులను ఉపసంహరించుకునే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని స్పష్టం చేశారు. కాగా, పటేల్ సామాజిక వర్గానికి ఎంతో గౌరవనీయుడైన రాడాడియాతో రిజర్వేషన్ల అంశంపై సమగ్ర చర్చలు జరిపానని, ఆయన ప్రతిపాదించిన రాజీ సూత్రం తమ సామాజికవర్గ ప్రజలకు ప్రయోజనం చేకూర్చేదిగా ఉంటే తప్పకుండా అంగీకరిస్తానని హార్దిక్ పటేల్ చెప్పారు.