జాతీయ వార్తలు

వేగంగా ప్రత్యేక హోదా ప్రక్రియ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: విభజన చట్టం హామీలను అమలు చేస్తూ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రక్రియ వేగవంతం చేయాలని హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరినట్టు వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం మధ్యాహ్నం పార్లమెంటు ఆవరణలో రాజ్‌నాథ్ సింగ్‌ను జగన్ కలిసి విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదా అంశంపై చర్చించారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని రాజ్‌నాథ్ హామీ ఇచ్చినట్టు తెలిపారు. లోక్‌సభలో వైకాపా పక్షం నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అధికారం ఉన్నచోటికి నేతలు చేరిపోతున్నారు. ఇది చాలా దారుణమైన విషయమని తెదేపాలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలను ఉద్దేశించి అన్నారు. పార్టీ ఫిరాయింపులు నిరాకరిస్తున్న వారికి చేతులెత్తి దండం పెడుతున్నానని వ్యాఖ్యానించారు. ఒక్క ఓటు తేడాతో అధికారాన్ని కోల్పోయిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆదర్శం కావాలన్నారు. వాజపేయి తలచుకుంటే నలుగురైదుగురు ఎంపీలను కొనగలిగి ఉండేవారని, కానీ ఆయనలా చేయలేదు. నీతి నిజాయితీకి కట్టుబడి ఉన్నారు కనుకే, ప్రభుత్వం పోయినా పట్టించుకోలేదని మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు. ప్రతిపక్షం మొత్తాన్ని కొనేసినా, చివరకు ప్రజలే ప్రతిపక్షం బాధ్యతలు నిర్వర్తిస్తారని ఆంధ్ర సిఎం చంద్రబాబును హెచ్చరించారు. గతంలో కాంగ్రెస్ ఇలాంటి చెండాలం పనులు చేసినందుకే, ఎన్టీఆర్ తెలుగుదేశం పెట్టగానే అధికారంలోకి వచ్చారన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెంచాల్సిందిగా రాజ్‌నాథ్‌ను కోరామన్నారు. అసెంబ్లీ సెగ్మెంట్ల సంఖ్య పెంపుపై రాజ్‌నాథ్ స్పష్టమైన హామీ ఇవ్వలేదన్నారు. తాను గతంలో అటార్నీ జనరల్‌తో మాట్లాడితే 2026 వరకు రెండు రాష్ట్రాల శాసన సభల సీట్ల సంఖ్య పెంచేందుకు అవకాశం లేదని స్పష్టం చేశారన్నారు. రెండు రాష్ట్రాల సిఎంలు కోరుతున్నారు కనుక రెండు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచేందుకు కేంద్ర చర్యలు తీసుకుంటుందా? లేదా? అనేది చూడాల్సి ఉందని రాజమోహన్ రెడ్డి అన్నారు. ఇదిలావుంటే జగన్‌మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.