జాతీయ వార్తలు

మోత లేని కూత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రైల్వేల ఆర్థిక స్థితి గడ్డుగావున్న నేపథ్యంలో ప్రయాణికుల, సరకు రవాణా చార్జీలను పెంచాలా వద్దా? అన్న చిక్కుముడిని రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఎదుర్కొంటున్నారు. భారం పెంచకుండా పోతే పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, ప్రయాణికులకు మరిన్ని సదుపాయాల కల్పన, భద్రతలాంటి అంశాలకు నిధులను ఎలా సమకూర్చకోవాలనేది గురువారం రెండో రైల్వే బడ్జెట్ సమర్పించనున్న రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు చిక్కు సమస్యగా మారవచ్చు. అయితే అవసరమైన నిధులకోసం ప్రభుత్వ మద్దతు, బయటినుంచి రుణాల సేకరణలాంటి వాటికే మంత్రి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవచ్చని, ప్రయాణికుల, సరకు రవాణా చార్జీల పెంపు జోలికి వెళ్లకపోవచ్చని భావిస్తున్నారు. రైల్వేల ఆదాయం అంచనాలకు తగినట్లుగా లేకపోవడం, మరోవైపు పెండింగ్‌లోని వివిధ ప్రాజెక్టులకు నిధులు పెంచాలని రాష్ట్రాలనుంచి డిమాండ్లు పెరుగుతూ ఉండటం, ప్రయాణికులకు సదుపాయాలు మెరుగుపర్చడానికి పెద్దఎత్తున నిధులు అవసరమైనందున ప్రయాణికుల, సరకు రవాణా చార్జీలను పెంచక తప్పని పరిస్థితే ఉన్నప్పటికీ సురేశ్ ప్రభు అలాంటి సాహసం చేయలేని వాతావరణమే కనిపిస్తోంది. దాదాపు బ్రిటీష్ కాలం నాటి రైల్వేల వ్యవస్థను ఆధునీకరించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం 13700 కోట్ల డాలర్లు వ్యయమయ్యే అయిదేళ్ల ప్రణాళికను ప్రకటించింది. అయితే ప్రయాణికుల చార్జీలతో పాటుగా సరకు రవాణా చార్జీల ద్వారా వచ్చే ఆదాయం ఈ ఏడాది అంచనా వేసిన దానికన్నా తగ్గే అవకాశాలే కనిపిస్తున్నాయి. గతంలో రైల్వేల ఆదాయం ఏటా రెండంకెల స్థాయిలో పెరుగుతూ వస్తుండగా, ఈ ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో రైల్వేల మొత్తం రాబడి 5.8 శాతమే పెరిగింది. మరోవైపు దాదాపు 26 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు, పింఛనుదార్లకు వేతన సంఘం సిఫార్సుల మేరకు వేతనాల పెంపు అమలు చేసినట్లయితే రైల్వేలపై మరింత పెనుభారం పడనుంది. అయితే త్వరలో తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌లాంటి పలు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో బడ్జెట్‌లో చార్జీల పెంపు ప్రతిపాదనలుండక పోవచ్చని రైల్వేలో ఒక వర్గం అంటోంది. దొడ్డిదారిన చార్జీలు పెంచడానికి ఎప్పుడైనా అవకాశం ఉన్నందున అలాంటి ప్రతిపాదన ఏదీ ఉండదని కూడా ఆ వర్గాలు అంటున్నాయి. అదే సమయంలో కొత్త రైలు ప్రాజెక్టులు, కొత్త రైళ్లు లాంటి ప్రకటనలు కూడా పెద్దగా ఉండకపోవచ్చని, స్థానిక అవసరాలు, డిమాండ్లను తీర్చడానికి అక్కడక్కడా కొన్ని సర్వీసులను ప్రకటించవచ్చని అంటున్నారు. అయితే ప్రయాణికుల భద్రత, సౌకర్యాల కల్పన, వ్యవస్థ ఆధునీకరణ లాంటి వాటికి మంత్రి బడ్జెట్‌లో పెద్ద పీట వేయవచ్చని తెలుస్తోంది. అలాగే రైళ్ల ద్వారా సరకు రవాణాను ప్రోత్సహించడం కోసం ప్రీమియం హైస్పీడ్ పార్సిల్ రైళ్లకోసం ఒక పథకాన్ని బడ్జెట్‌లో ప్రకటించవచ్చని అంటున్నారు. రైల్వేలు ఆశించిన మేరకు సాధారణ బడ్జెట్‌లో నిధుల కేటాయింపు ఉండే అవకాశాలు లేనందున బయటి మార్గాల ద్వారా నిధుల సమీకరణకు మంత్రి యత్నించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.