జాతీయ వార్తలు

తెలంగాణ జిల్లాలకు రూ.450 కోట్ల కేంద్ర నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు కేంద్రం రూ.450 కోట్లు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం తెలంగాణ జిల్లాలకు నిధులు ఇవ్వాల్సిన నేపథ్యంలో మొత్తం 10 జిల్లాల్లో హైదరాబాద్ మినహా మిగిలిన వెనుకబడిన ఒక్కో జిల్లాకు రూ.50 కోట్లు చొప్పున తొమ్మిది జిల్లాలకు రూ. 450 కోట్లు విడుదల చేసింది . ఈ సందర్భంగా ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తెజావత్ విలేఖరులతో మాట్లాడుతూ, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు ఈ నిధులను ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టులకు 2015-16 ఆర్థిక సంవత్సరానికి రూ.1000 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని మరోమారు తెలంగాణకు నిధుల కోసం విజ్ఞప్తి చేయనున్నట్లు తెజావత్ వెల్లడించారు.