జాతీయ వార్తలు

ఎవరేమన్నారంటే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాస్తవానికి దగ్గరగా
ఉంది: కవిత
రైల్యే బడ్జెట్ సానుకూలంగా, వాస్తవానికి దగ్గరగా ఉందని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. తెలంగాణకు సముచితంగా కేటాయింపులు జరిగాయన్నారు. తన నియోజకవర్గంలో పెద్దపల్లి - నిజామాబాద్ రైల్వేలైనుకు రూ.70 కోట్లు కేటాయించడం, బోధన్ నుండి బీదర్ రైల్వేలైన్‌కు నిధులు ఇవ్వడంపై కవిత సంతోషం వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లాకు నిధులు కేటాయించడం శుభపరిణామమని అన్నారు. కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ, డివిజన్ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని, భవిష్యత్తులో వాటికోసం ఒత్తిడి తీసుకొస్తామని ఆమె స్పష్టం చేశారు.

ఎంఎంటిఎస్ పొడిగింపు
హర్షణీయం: జితేందర్‌రెడ్డి
ముఖ్యమంత్రి కెసిఆర్ కోరిక మేరకే యాదాద్రి వరకు ఎంఎంటిఎస్‌ను పొడిగించేందుకు ఈ బడ్జెట్‌లో రూ.330 కోట్లు కేటాయించడం హర్షించదగ్గ విషయమని టిఆర్‌ఎస్ ఎంపి జితేందర్‌రెడ్డి అన్నారు. రైల్వేలోని అన్ని విభాగాలలో ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి తీసుకురావడం, సదుపాయాల కల్పన లాంటివి మంచి పరిణామమన్నారు. హంగు ఆర్భాటాలు లేకుండా వాస్తవానికి దగ్గరగా ఉందని వ్యాఖ్యానించారు.

సంస్కరణలకు ప్రాధాన్యత: దత్తాత్రేయ
రైల్వే బడ్జెట్‌ను కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ స్వాగతించారు. రైల్వేలో సంస్కరణలకు, ప్రయాణికుల సౌకర్యాలు, వౌళిక సదుపాయాల విస్తరణకు ప్రాముఖ్యతను ఇచ్చిందని తెలిపారు.
కేటాయంపులు సంతృప్తికరం: మేకపాటి
ఆంధ్రప్రదేశ్‌కు రైల్వేబడ్జెట్ కేటాయింపులు సంతృప్తిగానే ఉన్నాయని వైఎస్సాఆర్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమెహనరెడ్డి అన్నారు. నడికుడి -శ్రీకాళహస్తి, కోటిపల్లి-నర్సాపురం, కాకినాడ -పిఠాపురం, ఓబులవారిపల్లి- కృష్టపట్నం రైల్వేలైన్లకు నిధులు కేటాయించడం మంచి పరిణామమన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించివుంటే బాగుండేదన్నారు.

ప్రత్యేక రైల్వే జోన్
ఊసేది?: జెడి శీలం
రైల్వే బడ్జెట్ చాలా నిరాశ కలిగించిందని కాంగ్రెస్ ఎంపీ జెడీ శీలం చెప్పారు. విభజన చట్టంలో పేర్కొన్న ఏపి ప్రత్యేక రైల్వేజోన్‌పై ప్రకటన చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఆంధ్రకు రైల్వేజోన్, నిధులు కేటాయించకపోవడానికి రాజకీయ కారణాలేనని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేక పోయాయన్నారు.

ఆంధ్రకు ప్రాధాన్యం: ఎంపి తోట నర్సింహం
ఆంధ్రప్రదేశ్‌కు సరైన ప్రాధాన్యత లభించిందని టీడీపీ ఎంపీ తోట నర్సింహం అన్నారు. కోటిపల్లి -నరసాపురం లైన్‌కు రూ.150 కోట్లు, కాకినాడ- పిఠాపురంకు రూ.25 కోట్లు మంజూరు చేసిన రైల్వేమంత్రి సురేశ్ ప్రభు, ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
చారిత్రాత్మకం: ఎంపి రవీంద్రబాబు
దశాబ్దాలుగా కోనసీమ ప్రజలు ఎదురుచూస్తున్నా కోటిపల్లి - నరసాపురం రైల్వేలైన్‌కు ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించడం చారిత్రాత్మకమని అమలాపురం ఎంపీ రవీంద్రబాబు అన్నారు.
నిరాశాజనకం: ఎంపి అవంతి
విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుపై ప్రకటించకపోవడం కొంత నిరాశ కల్గించిందని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ అన్నారు.
తుని -కొత్తవలస రైల్వే లైనుకు నిధులు కేటాయించడంపై సంతోషం వ్యిక్తం చేశారు.