జాతీయ వార్తలు

నేనేమీ ఉగ్రవాదిని కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే/ముంబయి: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు జైలు జీవితం నుంచి ఎట్టకేలకు విముక్తి లభించింది. 1993లో ముంబయి పేలుళ్ల కేసులో దోషిగా తేలిన సంజయ్ దత్‌కు జైలు శిక్షను కుదించడంతో గురువారం ఆయన పుణేలోని యెరవాడ జైలు నుంచి 103 రోజుల ముందే విడుదలై స్వేచ్ఛను పొందాడు. ముంబయి పేలుళ్లకు సంబంధించిన చేదు జ్ఞాపకాలను వదిలేయాలనుకుంటున్నానని అతను చెప్పాడు. జైలు నుంచి ముంబయిలో ఇంటికి తిరిగి వచ్చిన అనంతరం సంజయ్ దత్ విలేఖర్లతో మాట్లాడుతూ, తానేమీ ఉగ్రవాదిని కాదని, టాడా చట్టం కింద దాఖలైన అభియోగాలతోపాటు కుట్రకు పాల్పడినట్లు వచ్చిన అభియోగాల్లో సుప్రీం కోర్టు తనను నిర్దోషిగా ప్రకటించిందని అన్నాడు. అంతేకాకుండా ఇకమీదట వార్తలు రాసేటప్పుడు తన పేరుకు ముందు ముంబయి పేలుళ్ల కేసును ప్రస్తావించ వద్దని విలేఖర్లకు విజ్ఞప్తి చేశాడు. అంతకుముందు యెరవాడ జైలులో సంజయ్ దత్ లాంఛనాలన్నీ పూర్తి చేసుకోవడంతో గురువారం ఉదయం దాదాపు 8.45 గంటలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ పోలీసులు ఆయనను బయటికి తీసుకొచ్చారు. నీలం రంగు చొక్కా, జీన్స్ ప్యాంటు ధరించి చిరునవ్వుతో బయటికి వచ్చిన సంజయ్ దత్ (56) అక్కడున్న వారికి అభివాదం చేస్తూ తన కోసం వేచి ఉన్న కారు వద్దకు వడివడిగా వెళ్లిపోయాడు. మంచి ఆరోగ్యంతో ఉన్నట్లు కనిపించిన సంజయ్ దత్ చేతిలో ఆయన వస్తువులతో కూడిన ఖాకీ రంగు సంచితో పాటు జైలు రికార్డులకు సంబంధించినదిగా భావిస్తున్న ఆకుపచ్చ రంగు ఫైల్ ఉన్నాయి. ఈ సందర్భంగా అక్కడ కొన్ని నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. జైలు నుంచి బయటికి వచ్చిన వెంటనే దత్ వెనక్కి తిరిగి జైలు భవనంపై గల మువ్వనె్నల జెండాకు శాల్యూట్ చేయడంతో పాటు కిందికి వంగి నేలను స్పృశించాడు. అనంతరం ఆయన అప్పటికే అక్కడ తనకోసం కారులో ఎదురుచూస్తున్న భార్య మాన్యత, స్నేహితుడు, ఎంతో ప్రేక్షకాదరణ పొందిన ‘మున్నాభాయ్’ చిత్ర నిర్మాత రాజ్‌కుమార్ హిరానీతో కలసి చార్టర్డ్ విమానంలో ముంబయి వెళ్లేందుకు పుణే విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా పుణే విమానాయశ్రయం వెలుపల సంజయ్ దత్ విలేఖర్లతో మాట్లాడుతూ, స్వేచ్ఛ పొందడం అంత సులభమైన విషయం కాదన్నాడు.
జైలు వెలుపల నిరసన
సంజయ్‌ను ముందుగానే జైలు నుంచి విడుదల చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అతని విషయంలో అధికారులు ‘ప్రత్యేకమైన శ్రద్ధ’ తీసుకున్నారని నిందిస్తూ గురువారం కొంత మంది ఆందోళనకారులు యెరవాడ జైలు వెలుపల నినాదాలు చేశారు. అయితే జైలు మాన్యువల్, ఇతర నియమ నిబంధనలకు అనుగుణంగానే సంజయ్ దత్ శిక్షాకాలాన్ని కుదించడం జరిగిందని జైలు అధికారులతో పాటు అతని లాయర్లు చెప్పుకొచ్చారు.
chitram...
పుణేలోని యెరవాడ జైలు నుంచి బయటకు వస్తూ అభివాదం చేస్తున్న సంజయ్ దత్