జాతీయ వార్తలు

రైల్వే బడ్జెట్ హైలైట్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైల్వే మంత్రి సురేష్ ప్రభు 2016 సంవత్సరానికి గాను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ఎన్నో ప్రత్యేకతలకు, కొత్త ఆలోచనలకు అద్దం పట్టింది. మొత్తం బడ్టెల్‌లో ఆయన చేసిన కీలక ప్రతిపాదనల్లో కొన్ని...
ప్రధాని నరేంద్ర మోదీ కలల సాకారమే లక్ష్యం
92 శాతం ఆపరేషన్స్ నిష్పతి సాధనే ధ్యేయం
మరో వంద రైల్వే స్టేషన్లలో వైఫై సదుపాయం
వచ్చే ఏడాది మరో 400 స్టేషన్లకు విస్తరణ
కోరిన ఆహారంతో ఏసి హంసఫర్ ఎక్స్‌ప్రెస్
మరో 1780 ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మిషన్లు
సీనియర్ సిటిజన్లకు లోయర్‌బెర్త్ కోటా 50 శాతానికి పెంపు
2800 కిలోమీటర్ల మేర బ్రాడ్‌గేజ్ ట్రాక్‌ల నిర్మాణం
ప్రతిరోజూ 7 కిలోమీటర్ల చొప్పున గేజ్‌ల మార్పిడి
ఐదేళ్లలో వౌలిక సదుపాయాలపై 8.8 లక్షల కోట్ల ఖర్చు
ప్రభుత్వం నుంచి బడ్జెట్ మద్దతుగా 45వేల కోట్ల సాయంపై ఆశ
మూలధన ఖర్చు అంచనా 1.21 లక్షల కోట్లు
సామాజిక మీడియా వినియోగంపై దృష్టి
ఆన్‌లైన్‌లోనే విశ్రాంతి గదుల బుకింగ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సంలోగా 17వేల బయోటాయిలెట్లు
అన్ని స్టేషన్లలోనూ స్థానిక కళలకు ప్రాధాన్యత
2017-18 సంవత్సరంలో 9కోట్ల పనిదినాల కల్పన
రానున్న ఐదేళ్లలో ఎల్‌ఐసి నుంచి 1.5 లక్షల కోట్ల నిధి
మహిళలకుకోసం దేశ వ్యాప్తంగా నిరంతర హెల్ప్‌లైన్
ఎక్కువ సాంద్రతగల కారిడార్‌లో పూర్తిగా రిజర్వేషన్లు లేని రైళ్లు
కాపాలాలేని క్రాసింగ్‌లకు స్వస్తి
ప్రయాణికులకు స్థానిక వంటకాలు అందించే యోచన
పిల్లలకు వేడినీళ్లు, బేబీఫుడ్స్, పాలు సరఫరా
ఆన్‌లైన్ నెంబర్ 139 ద్వారా కేన్సిలేషన్ సౌకర్యం
ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ‘క్లీన్‌మై కోచ్’ విధానం
ప్రయాణికులకోసం మరో 65వేల అదనపు బెర్త్‌లు
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా బయో వ్యాక్యూమ్ టాయిలెట్లు
మొబైల్ యాప్స్, గో ఇండియా, స్మార్ట్ కార్డులతో యుటిఎస్, టిఆర్‌ఎస్ టికెట్లు
హెల్ప్‌లైన్లు, సిసిటీవీలతో మరింత భద్రత

మధ్య బెర్తులు ఇక మహిళలకే!

న్యూఢిల్లీ: రైళ్లలో మహిళలకు అదనపు భద్రత కల్పించడానికి గాను కోచ్‌లలో మధ్య బెర్తులను మహిళలకు రిజర్వు చేయనున్నట్లు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. మహిళల భద్రతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో భాగంగా 24 గంటల పాటు పనిచేసే హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. నడుస్తున్న రైళ్లలో మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో మంత్రి ఈ ప్రకటన చేశారు. రైల్వే శాఖలో భద్రతా చర్యలలో భాగంగా దేశవ్యాప్తంగా గల 311 రైల్వే స్టేషన్లలో సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
కేటరింగ్ సర్వీసులలోని రిజర్వుడ్ కేటగిరీలలో మహిళలకు 33 శాతం సబ్ కోటాను కేటాయించనున్నట్లు మంత్రి ప్రకటించారు.