జాతీయ వార్తలు

రైలు ప్రమాదాల నివారణకు మిషన్ ‘జీరో యాక్సిడెంట్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రైలు ప్రమాదాలను నివారించడానికి మంత్రి సురేశ్ ప్రభు తన రైల్వే బడ్జెట్‌లో మిషన్ ‘జీరో యాక్సిడెంట్’ పేరిట రూపొందించిన ఒక ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ ప్రణాళిక ప్రకారం రానున్న మూడు, నాలుగేళ్లలో దేశంలోని బ్రాడ్‌గేజ్ నెట్‌వర్క్‌లపై ఉన్న అన్ని కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌లను తొలగిస్తారు. దీనికోసం సృజనాత్మకమైన ఫైనాన్సింగ్ యంత్రాంగం పనిచేస్తుంది. ఈ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కాపలా లేని అన్ని లెవెల్ క్రాసింగ్‌లను తొలగించడంతోపాటు రైల్వే నెట్‌వర్క్‌లో ట్రైన్ కొలీజన్ అవాయిడెన్స్ సిస్టం (టిసిఎఎస్)ను ఏర్పాటు చేస్తారు. ‘ఒక్క ప్రమాదం జరిగినా లేక ఒక్క ప్రాణం పోయినా అది నన్ను తీవ్ర దుఃఖానికి, క్షోభకు గురిచేస్తుంది. అసలు ప్రమాదాలే జరగని మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనం ఇంకా సుదూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది’ అని మంత్రి సురేశ్ ప్రభు తన రైల్వే బడ్జెట్ ప్రసంగంలో అన్నారు. కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌లు రైల్వేలకు వినాశన హేతువులు అవుతున్నాయని, ఎక్కువ ప్రమాదాలు ఇక్కడే జరుగుతున్నాయని ఆయన వివరించారు. రైళ్ల సగటు వేగాన్ని పెంచడానికి ఒక స్వదేశీ పరిజ్ఞానాన్ని కనుగొన్నామని, ఇలా సగటు వేగం పెరగడం వల్ల నిర్దిష్ట సమయంలో ఒక కేంద్రం మీదుగా వెళ్లే రైళ్ల సంఖ్య కూడా పెరుగుతుందని మంత్రి వివరించారు. రానున్న మూడేళ్లలో అధిక సాంద్రత గల రైలు నెట్‌వర్క్‌లన్నింటిలో టిసిఎఎస్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని భావిస్తున్నామని ఆయన వివరించారు. ప్రపంచంలోని పేరుగాంచిన రైల్వే సంస్థలతో భారతీయ రైల్వేలు పరిశోధన, అభివృద్ధి భాగస్వామ్యాలను కుదుర్చుకున్నాయని ఆయన వెల్లడించారు. వీటిలో జపాన్‌లోని రైల్వే టెక్నికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, కొరియాలోని రెయిల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఉన్నాయని ఆయన తెలిపారు.
ఈ సంస్థలు భారత్‌లో ప్రస్తుతం ఉన్న రైల్వే నెట్‌వర్క్‌లలో ఆపరేషన్లను మెరుగుపరచడంతో పాటు జీరో యాక్సిడెంట్ వ్యవస్థకు రోడ్‌మ్యాప్‌ను అందజేస్తాయని మంత్రి వివరించారు.