జాతీయ వార్తలు

సజీవంగా పట్టుబడ్డ జైషే యువ ఫిదారుూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: ఉగ్రవాదంపై పోరులో భారత్ గొప్ప విజయం సాధించింది. పాకిస్తాన్‌లోని జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన యువ ‘్ఫదారుూ’ (ఆత్మాహుతి దళ సభ్యుడి)ని జమ్మూ-కాశ్మీరులోని బారాముల్లాలో గురువారం సజీవంగా పట్టుకుంది. ఈ ఉగ్రవాదిని మొహమ్మద్ సాదిక్ గుజ్జర్ (17)గా గుర్తించారు. కుప్వారా జిల్లా తాంగ్ధర్‌లోని సైనిక శిబిరంపై గత ఏడాది నవంబర్ 25న దాడికి పాల్పడిన ఉగ్రవాద బృందంలో గుజ్జర్ కూడా ఉన్నాడు. ఈ దాడి సందర్భంగా ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది మట్టుబెట్టగా గుజ్జర్ తప్పించుకున్నాడు. అయితే సైనిక, రాష్ట్రీయ రైఫిల్స్ బలగాలతోపాటు జమ్మూ-కాశ్మీరు పోలీసులతో కూడిన సంయుక్త బృందం గురువారం వలపన్ని గుజ్జర్‌ను నిర్బంధించి, అతని నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుంది. పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్‌కు చెందిన గుజ్జర్ జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థలో అఫ్జల్ గురు దళానికి చెందిన సభ్యుడు. గతంలో తాము తాంగ్ధర్‌లో జరిపిన దాడిని పాక్ ఆక్రమిత కాశ్మీరు (పిఓకె)లోని అత్ముకమ్ నుంచి ప్రారంభించామని గుజ్జర్ ఇంటరాగేషన్‌లో వెల్లడించినట్లు తెలుస్తోంది. కొద్ది నెలల నుంచి చాలా చురుకుగా కార్యకలాపాలు సాగిస్తున్న అఫ్జల్ గురు దళం ఇటీవల పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడికి తెగబడటంతోపాటు మూడు ఆత్మాహుతి దాడులకు పాల్పడింది. గుజ్జర్ గత 15 రోజుల నుంచి బారాముల్లా ఏరియాలో సంచరిస్తుండటంతో భద్రతా దళాలు అతని కదలికలపై నిఘా పెట్టి గురువారం సజీవంగా అరెస్టు చేశారు.
chitram...
పట్టుబడిన ఉగ్రవాదిని, పేలుడు సామాగ్రిని విలేఖరులకు చూపుతున్న భద్రతా దళాలు