జాతీయ వార్తలు

పట్టాలెక్కనున్న 4 కొత్తరకం రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తన రైల్వే బడ్జెట్ ప్రసంగంలో అనేక కొత్త రైళ్లను ప్రకటించారు. ఇందులో నాలుగు కొత్త తరహా రైళ్లున్నాయి. రద్దీగా ఉండే, ఎక్కువ దూరంలో గల మార్గాలలో రిజర్వేషన్ లేని సూపర్ ఫాస్ట్ రైలు ‘అంత్యోదయ’ ఎక్స్‌ప్రెస్‌ను, పూర్తిస్థాయిలో ఎయిర్‌కండిషన్ సదుపాయం ఉన్న ‘హుమ్‌సఫర్’ ఎక్స్‌ప్రెస్, గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ‘తేజాస్’ను ఆయన ప్రకటించారు. తేజాస్ లోపల ప్రపంచస్థాయి సేవలు అందుబాటులో ఉంటాయి. భారత్‌లో భవిష్యత్తులో రైలు ప్రయాణానికి అద్దంపట్టేలా ఇది ఉంటుంది. రద్దీగా ఉండే మార్గాలలో రాత్రి ప్రయాణం కోసం డబుల్ డెక్కర్ రైలు ‘ఉదయ్’ ఎక్స్‌ప్రెస్‌ను మంత్రి ప్రకటించారు. మామూలు రైళ్లతో పోలిస్తే ఈ రైలుకు ప్రయాణికులను తీసికెళ్లే సామర్థ్యం 40 శాతం అదనంగా ఉంటుంది. కొన్ని దూరప్రాంతాలకు రిజర్వేషన్ లేని ప్రయాణికులకోసం రెండు నుంచి నాలుగు ‘దీనదయాళ్’ కోచ్‌లను ఈ రైలుకు తగిలిస్తారు. ఈ రైలులో సురక్షితమైన మంచినీరు, మొబైల్ చార్జింగ్ పాయింట్లు కూడా ఉంటాయి.