జాతీయ వార్తలు

భారత్.. ఆశాకిరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్గాం (కర్నాటక): మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే భారత దేశం చుక్కాని లాంటిదని ప్రధాన నరేంద్ర మోదీ అన్నారు. ఆర్థిక మాంద్యంతో పాటు అనేక రకాలుగా సమస్యలను ఎదుర్కొంటున్న ప్రపంచ దేశాలకు ఒక్క భారత దేశమే ఆశాకిరణంగా భాసిల్లుతోందని చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రపంచ బ్యాంక్, ఐఎమ్‌ఎఫ్, ఇతర రేటింగ్ సంస్థలు వెలువరించిన నివేదికలను మోదీ ఉటంకించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా ఆశావహ సంకేతాలు ఉన్నాయంటే అవి భారత్ నుంచేనని ఈ సంస్థలన్నీ ముక్తకంఠంతో పేర్కొన్నాయన్నారు. శనివారం నాడిక్కడ జరిగిన రైతు ర్యాలీలో మాట్లాడిన మోదీ గత ఏడాదిన్నరగా తమ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, కార్యక్రమాలను ప్రస్తావించారు. పేదల జీవితాల్లోనూ, గ్రామీణ జీవనంలోనూ పరివర్తన తీసుకురావాలన్న కృత నిశ్చయంతో తన ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇప్పటి వరకూ చేపట్టిన ఏ కార్యక్రమంలోనూ అవినీతికి ఆస్కారమే లేకపోవడం తమ ప్రభుత్వ ప్రత్యేకత అన్నారు. అనేక అంశాలపై ఎన్‌డిఎ సర్కార్‌ను నిలదీస్తున్న విపక్షాలు ఒక్క అవినీతి ఆరోపణ కూడా చేయక పోవడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. దేశ వ్యాప్తంగా రైతాంగానికి చేరువయ్యే లక్ష్యంతో చేపట్టిన ఈ భారీ ర్యాలీలో విపక్షాల తీరును కూడా మోదీ నిలదీశారు. తాను ప్రధాన మంత్రి పదవిని చేపట్టినప్పటి నుంచి పూర్తి స్థాయి రుజువర్తనతో పని చేస్తున్నామని, అవినీతి ఆరోపణలతో కూరుకుపోయిన వారికి తాను కంటగింపుగా మారానని మోదీ పేర్కొన్నారు. బ్లాక్ మార్కెటింగ్, అవినీతిని అంతం చేయడానికి తాను చేపట్టిన చర్యలు గిట్టని వారు తనకు వ్యతిరేకంగా మారారన్నారు. 2017 నాటికల్లా రైతులకు భూసార నిర్థారణ కార్డులను అందిస్తామని, పంట బీమా ఆదాయాన్ని ఉపయోగించుకుని రైతులు తమ ఆదాయాన్ని పెంచుకోవాలని మోదీ సూచించారు. గతంలో యూరియా సరఫరాలో నల్ల వ్యాపారం జరిగేదని, దీన్ని పొందేందుకు రైతులు పోలీసు లాఠీ దెబ్బలకూ గురి కావాల్సి వచ్చేదని గుర్తు చేశారు. పంట దిగుబడిని పెంచడం, యూరియా మళ్లింపును అరికట్టేందుకు తమ ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. ఎరువులు కావాలంటూ ఈ ఏడాది ఏ రాష్ట్రం నుంచి తనకు లేఖలు రాలేదని, ఇందుకు కారణం యూరియా బ్లాక్ మార్కెటింగ్, అవినీతిని నిరోధించగలగడమేనని తెలిపారు. గత ఆరు దశాబ్దాలుగా ఈ జాడ్యాలకు అలవాటు పడిన వారికి ఇప్పుడా అవకాశం లేకుండా పోవడం వల్లే తనపై కనె్నర్ర చేస్తున్నారన్నారు.

చిత్రం... కర్నాటక రాష్ట్రం బెల్గాంలో శనివారం నిర్వహించిన
రైతు ర్యాలీ సభా వేదిక నుంచి ధాన్యాన్ని తూర్పారబడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ