జాతీయ వార్తలు

మోదీయే నెం.1

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారతీయుల్లో అత్యంత ప్రభావశీలత కలిగిన 100 ప్రముఖుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్‌కు రెండో స్థానం లభించింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ భారత్‌కు చెందిన వందమంది ప్రముఖల జాబితాలో ఈ పవర్ లిస్టును రూపొందించింది. అనేక రకాలుగా వివాధాలు చుట్టుముడుతున్నప్పటికీ మోదీ జనాకర్షక శక్తి ఎంత మాత్రం తగ్గలేదని తెలిపింది. అసహనంపై చర్చ, బిహార్‌లో ఓటమి, రోహిత్ వేముల ఆత్మహత్య, జెఎన్‌యు వివాదం ఇవన్నీ నీడలా వెంటాడుతున్నప్పటికీ ప్రధాని మోదీ నెంబర్ 1 స్థానంలో నిలిచారని పేర్కొంది. అలాగే ప్రస్తుత ప్రభుత్వంపై అత్యంత ప్రభావం కలిగిన ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ రెండో స్థానం దక్కించుకున్నారని జాబితా వెల్లడించింది. ప్రధాని మోదీకి సంఘ్ పరివార్ వెన్నుదన్నుగా నిలుస్తోందని ఈ పరివార్‌లో ప్రముఖ సంస్థగా ఆర్‌ఎస్‌ఎస్ తన ఉనికిని చాటుకునేలా మోహన్ భగవత్ నిరుపమాన కృషి చేస్తున్నారని తెలిపింది. ఇక మూడో స్థానంలో బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా, నాలుగో స్థానంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఐదో స్థానంలో కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ ఉన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి తొమ్మిదో స్థానం దక్కింది. ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ ఎనిమిదో స్థానం దక్కింది.