జాతీయ వార్తలు

బడ్జెట్.. నాకూ పరీక్షే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ‘మీకే కాదు..నాకూ పరీక్ష ఉంది. అది సాధారణ బడ్జెట్ పరీక్ష.నేనూ దాన్ని ఎదుర్కోవాలి’అంటూ ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థుల నుద్దేశించి అన్నారు. మొత్తం 125 కోట్ల మంది పెట్టే ఈ పరీక్షను ఎదుర్కోగలనన్న ధీమా తనకు ఉందని తెలిపారు. మంగళవారం టెన్త్, ఇంటర్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు ఎలాంటి వత్తిళ్లకు లోనుకాకుండా వాటిని ఎదుర్కోవాలని స్ఫూర్తిదాయక రీతిలో స్పష్టం చేశారు. ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమైన ‘మనసులోని మాట’లో మోదీ అనేక కోణాల్లో విద్యార్థులకు ప్రేరణ కలిగించారు.సిఎన్‌ఆర్.రావు, ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండుల్కర్, చదరంగం దిగ్గజం విశ్వనాధన్ ఆనంద్ కూడా మాట్లాడారు. ఈనాటి ప్రసంగమంతా విద్యార్థుల పరీక్షలు, వాటిని విజయవంతంగా ఎదుర్కొనేందుకు అనుసరించవలసిన విధానాలపైనే కేంద్రీకరించారు. పార్లమెంటులో సోమవారం బడ్జెట్ ప్రతిపాదన ద్వారా తానుకూడా పరీక్షను ఎదుర్కోబోతున్నట్లు ఆయన విద్యార్థులతో చెప్పారు. పరీక్షల్లో మీరు, నేను మంచి మార్కులతో ఉత్తీర్ణులమైతే దేశం బాగుపడుతుందని ఆయన చెప్పారు. వదిలిపెట్టకుండా పని చేయటమే విజయ రహస్యమని ఆయన సూచించారు. విజయం సాధించేందుకు అంకితభావం, శ్రద్ధ, పట్టుదల ఎంతో అవసరమని సూచించారు. పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఒక స్పష్టమైన నిత్యకృత్యాన్ని కార్యక్రమాన్ని పాటించాలని, అవసరమైనంత సమయం నిద్రపోవటం ద్వారా అరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పారు. దాదాపు అరగంటపాటు సాగిన ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను ఉటంకించారు. వాస్తవిక లక్ష్యాలను నిర్ధారించుకుని వాటిని సాధించేందుకు కష్టపడి పని చేయాలని సచిన్ తెందుల్కర్ విద్యార్థులకు హితవు చెప్పటాన్న నరేంద్ర మోదీ ప్రస్తావించారు. వత్తిడిని తట్టుకుని సహేతుక, సానుకూల, ఏకాగ్రతతో కూడిన విధానాన్ని అవలంభించాలని సచిన్ చేసిన సూచనను పాటించాలని మోదీ విద్యార్థులకు వివరించారు. చదరంగం దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌ను కూడా నరేంద్ర మోదీ ప్రశంసలతో ముంచెత్తారు. విశ్వనాథన్ తన లక్ష్యాన్ని సాధించేందుకు ఏకాగ్రత, పట్టుదలతో కృషి చేస్తారని చెప్పారు. పరీక్షలను విజయవంతంగా ఎదుర్కొని ఆశించిన ఫలితాలను సాధించాలంటే రాత్రిపూట బాగా నిద్రపోవటంతోపాటు ప్రశాంతంగా ఉండాలన్న విశ్వనాథన్ ఆనంద్ ఇచ్చిన సలహాను పాటించాలని మోదీ విద్యార్థులకు సూచించారు. పరీక్షలు కూడా చదరంగం లాటివేనని, ప్రశాంతంగా ఉన్న మేధస్సే సరైన సమయంలో సరైన సమాధానాన్ని గుర్తుచేసుకుంటుందని గుర్తుచేశారు. తనకు ఎదురయ్యే రోజువారీ వత్తిడిని తట్టుకునేందుకు తాను ధ్యానం చేస్తానని, లోతైన శ్వాస తీసుకోవటం ద్వారా వత్తిడి నుండి ఉపశమనం కలుగుతుందని తెలిపారు. అంతర్గత ప్రశాంతతకు క్రమం తప్పకుండా యోగ చేయాలని హితవు చెప్పారు. ఒక విజయాన్ని సాధించేందుకు పలుమార్లు అపజయాన్ని చవిచూడాల్సి వస్తుందని థామస్ అల్వా ఎడిసన్ (బల్బును కనిపెట్టిన వ్యక్తి), హారీ పోటర్ నవలా రచయిత జె.కె.రోవ్లింగ్ పేర్లను మోదీ ఉదహరించారు. అపజయాలతో భయపడకుండా లక్ష్య సాధనకు కృషి చేయాలని చెప్పారు. అపజయాలకు భయపడకుండా ముందుకు సాగితేనే ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతామని అన్నారు. కొత్త కొత్త విషయాలను తెలుసుకునేందుకు శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం ఎంతో అవసరమని స్పష్టం చేశారు. జాతీయ సైన్స్ దినోత్సవం గురించి ప్రస్తావిస్తూ, దేశానికి చెందిన శాస్తవ్రేత్తలనందరినీ అభినందించారు. గురుత్వాకర్షణ అలలను కనుగొన్నవారిలో మన శాస్తవ్రేత్తలు కూడా ఉన్నారని నరేంద్ర మోదీ గుర్తుచేశారు.
గురుత్వాకర్షణ అలలపై తదుపరి పరిశోధన జరిపేందుకు మన దేశంలో గ్రావిటేషనల్ వేవ్ ఆబ్సర్వేటరీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.