జాతీయ వార్తలు

స్మృతి చుట్టూ వివాదాల ముసురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జెఎన్‌యులో చోటుచేసుకున్న పరిణామాలపై పార్లమెంటులో తన వాగ్ధాటితో అధికారపక్ష సభ్యుల్ని మెప్పించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి పార్టీలో మాత్రం పరిస్థితి అంత అనుకూలంగా లేనట్టు తెలుస్తోంది. పైపెచ్చు.. చర్చ జరిగిన తొలిరోజు లోక్‌సభలో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యల పట్ల అధిష్ఠానం గుర్రుగా ఉందట. స్మృతి ఇరానీ మాట్లాడిన వెంటనే కొందరు పార్టీ పెద్దలు ఆమెకు ‘క్లాస్’ తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారంపై ఏషియన్ ఏజ్ పత్రికలో వచ్చిన కథనం ప్రకారం సభలో మెలోడ్రామా పండించేందుకు ప్రయత్నించవద్దని బిజెపిలోని కొందరు పెద్దలు ఆమెను సున్నితంగా హెచ్చరించారట. బహుశా అందుకేనేమో, గురువారం లోక్‌సభలో ధాటిగా మాట్లాడిన స్మృతి, ఆ మర్నాడు రాజ్యసభలో కాస్త స్పీడ్ తగ్గించారు. పైగా రాజ్యసభలో ఆమె మాట్లాడుతున్నప్పుడు జెఎన్‌యు ఘటనను ‘బ్యాలెన్స్’ చేసేందుకు మధ్యలో జోక్యం చేసుకోవలసిందిగా అరుణ్ జైట్లీని అధిష్ఠానం ఆదేశించిందట. స్మృతి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్ జోక్యం చేసుకోవడం అధిష్ఠానం ఆదేశాల మేరకేనని ఏషియన్ ఏజ్ పేర్కొంది.
మరోవైపు బిజెపిలోని ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన నేతలు స్మృతి ఇరానీ మహిషాసురుడిపై చేసిన వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేశారట. జెఎన్‌యుకు చెందిన కొందరు విద్యార్థులు ప్రచురించారని చెబుతున్న ‘మహిషాసురుడి అమరత్వం’ కరపత్రంలోని అంశాలను ఆమె చదివి వినిపిస్తున్నప్పుడు విపక్ష సభ్యులు పెద్దపెట్టున అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సమాజంలోని కొన్ని వర్గాలు మహిషాసురుణ్ని రాక్షసుడిగా పరిగణించవనీ, స్మృతి వ్యాఖ్యలు వారి మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని ఓబిసి నేతలు అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్ళినట్టు ఏషియన్ ఏజ్ కథనంలో పేర్కొన్నారు. ఇదిలాఉండగా స్మృతి ఇరానీ సభలో చదివిన కరపత్రాన్ని తాను గానీ, తన సహచరులుగానీ రాసింది కాదని, ఆమె అబద్ధాలు చెబుతున్నారని జెఎన్‌యు విద్యార్థి నేత అనిల్ కుమార్ ఆరోపించారు. సభలో స్మృతి ఓ రంగుల కాగితాన్ని చేత్తో పట్టుకుని చదివాని, అది జెఎన్‌యు విద్యార్థులు ప్రచురించింది కాదని ఆయన స్పష్టం చేశారు. రంగుల కరపత్రం ముద్రణకు ఎక్కువ ఖర్చు అవుతుందని, అలాంటివి జెఎన్‌యు విద్యార్థులు ఉపయోగించరని ఆయన చెప్పారు. స్మృతి చూపించిన కరపత్రం నకిలీదని అనిల్ అన్నారు.
మరోవైపు సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ స్మృతి ఇరానీని మరో వివాదంలోకి లాగేందుకు ప్రయత్నించారు. బిజెపిలో చేరడానికంటే ముందు స్మృతి ఇరానీ కాంగ్రెస్‌లో చేరాలని భావించారంటూ దిగ్విజయ్ బాంబు వేశారు. ఇది కూడా పార్టీలో కలకలం రేకెత్తిస్తోంది.

చత్తీస్‌గఢ్‌లో 23 మంది
మావోల లొంగుబాటు
రాయ్‌పూర్, ఫిబ్రవరి 28: చత్తీస్‌గఢ్‌లో పెద్దసంఖ్యలో మావోయిస్టులు ఆదివారం పోలీసులకు లొంగిపోయారు. సుమారు 23మంది నక్సలైట్లు తమంతట తాముగా వచ్చి బస్తర్ జిల్లా పోలీసులకు ఆయుధాలను అప్పగించి లొంగిపోయారు. మావోయిస్టుల విధ్వంసకాండతో అతలాకుతలమవుతున్న చత్తీస్‌గఢ్‌లో ఇంతపెద్ద సంఖ్యలో నక్సల్స్ లొంగిపోవడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. లొంగిపోయిన వారిలో కట్కు, లాలి మాండవి, రాజు మాండవి అనే దళ నేతలు ఉన్నారు. ఈ ముగ్గురిపై తలా మూడు లక్షల రివార్డు ఉంది. లొంగిపోయినవారిలో చేత్నా నాట్య మండలి నేత కవాసి గోరె కూడా ఉన్నారు. ఇతని తలపై లక్ష రూపాయల బహుమానాన్ని గతంలో పోలీసులు ప్రకటించారు. లొంగిపోయిన వారందరికీ పది వేల రూపాయలను ప్రోత్సాహకంగా ఇవ్వనున్నట్టు బస్తర్ ఎస్‌పి ఆర్‌ఎన్ దాష్ చెప్పారు.