అంతర్జాతీయం

సౌత్ కరోలినాలో హిల్లరీ ఘనవిజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబియా: అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్ సౌత్ కరోలినా రాష్ట్రం ప్రైమరీ ఎన్నికల్లో తన ప్రత్యర్థి బెర్నీ సాండర్స్‌ను చిత్తుగా ఓడించారు. ‘సూపర్ ట్యూజ్‌డే’ ప్రదర్శనకు ముందే డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ఆమె రేసులో ముందున్నారు. సౌత్ కరోలినా ప్రైమరీ ఎన్నికల్లో క్లింటన్ సుమారు 50 శాతం పాయింట్లతో సాండర్స్‌ను చిత్తుగా ఓడించారు. నల్లజాతీయుల నుంచి గట్టి మద్దతు లభించడంతో ఆమె ఈ ఘన విజయం సాధించారు. ఎనిమిదేళ్ల క్రితం డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ఒబామాతో పోటీ పడిన క్లింటన్‌కు ఇక్కడి నల్ల జాతీయులు మద్దతివ్వలేదు. ఆ ఎన్నికల్లో వారు ఒబామాకు బాసటగా నిలిచారు. కాగా, ఈ సంవత్సరం ఇప్పటి వరకు జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో హిల్లరీ ఈ స్థాయిలో ఘన విజయం సాధించడం ఇదే మొదటిసారి. ఇంతకు ముందు లోవా కౌకుసెస్‌లో ఆమె స్వల్ప ఆధిక్యంలో నిలిచారు. న్యూ హాంపిషైర్‌లో ఆమె సాండర్స్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఈ వారం మొదట్లో హిల్లరీ నెవడ కౌకుసెస్‌లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో అయిదు శాతం పాయింట్లతో విజయం సాధించారు. ‘సూపర్ ట్యూజ్‌డే’ ప్రదర్శనకు ముందు ఆదివారం సాధించిన ఘన విజయంతో హిల్లరీ తిరుగులేని ముందంజను సాధించారు. మంగళవారం 11 రాష్ట్రాల్లోనూ డెమొక్రటిక్ పార్టీ ప్రైమరీ ఎన్నికలు జరుగనున్నాయి. ‘రేపు ఈ ప్రచారం దేశవ్యాప్తంగా జరుగుతుంది. ప్రతి రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఓటు కోసం మేము పోడీ పడబోతున్నాం’ అని హిల్లరీ తన విజయోత్సవ ర్యాలీలో మాట్లాడుతూ అన్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రైమరీ ఓట్ల లెక్కింపులో హిల్లరీ క్లింటన్ 73.5 శాతం ఓట్లు సంపాదించగా, ఆమె ప్రత్యర్థి సాండర్స్ కేవలం 26 శాతం ఓట్లతో బాగా వెనుకబడి ఉన్నారు.

కొలంబియా సభలో మాట్లాడుతున్న డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్