జాతీయ వార్తలు

తెలుగు రాష్ట్రాలకు మొండిచెయ్యి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అరుణ్ జైట్లీ లోక్‌సభలో ప్రతిపాదించిన 2016-17 బడ్జెట్‌లో రెండు తెలుగు రాష్ట్రాలకు మొండి చెయ్యి తప్ప పెద్దగా ఏమీ లభించలేదు. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు గత వారం ప్రతిపాదించిన రైల్వే బడ్జెట్‌లోనూ తెలుగు రాష్ట్రాలకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఏపి పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన హామీలు, ప్రకటించిన ప్యాకేజీలను తప్పకుండా అమలు చేస్తామనే ఒక హామీ తప్ప జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో తెలుగు రాష్ట్రాలకు కేటాయింపుల గురించి పెద్దగా ప్రస్తావించలేదు. ఎఫ్.ఆర్.బి.ఎం శాతాన్ని మూడు నుండి మూడున్నర శాతానికి పెంచాలన్న తెలంగాణ ప్రధాన డిమాండ్‌ను జైట్లీ తుంగలో తొక్కారని చెప్పకతప్పదు. అమరావతి నిర్మాణానికి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం ప్రకటించాలని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఈ బడ్జెట్‌లో నాలుగు ఐదు వేల కోట్లు కేటాయించాలని, ఆర్థిక లోటు భర్తీకి ఆర్థిక సహాయం చేయాలని ఏపి ప్రభుత్వం చేసిన మొరను మోదీ ప్రభుత్వం పట్టించుకోకపోవటం గమనార్హం. సాధారణ బడ్జెట్‌లో తమకు అన్యాయం జరిగిందని గ్రహించిన తెలుగుదేశం ఎంపీలు లోక్‌సభ వాయిదా పడగానే హడావుడిగా జైట్లీ కార్యాలయానికి వెళ్లి రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పుకోమంటారు? వారిని ఎలా ఎదుర్కొనగలమంటూ ప్రశ్నలు కురిపించారు. జైట్లీ మాత్రం నింపాదిగా తన బడ్జెట్ ప్రసంగం ప్రతిని వారి ముందుంచి ఏపి విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని, ఆర్థిక ప్యాకేజీలను అమలు చేస్తామనే హామీ ఇచ్చాము కదా? అని సూచించి వారిని వెనకకు పంపించివేశారు. ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై బడ్జెట్‌లో ఎలాంటి వ్యాఖ్య చేయని అంశాన్ని టిడిపి ఎంపీలు జైట్లీకి వివరించాలనుకున్నారు. కానీ ఆయన వద్దకు వెళ్లిన తరువాత వారంతా కొంత మెతకవైఖరి అవలంబించటం గమనార్హం. తెలంగాణ, ఆంధ్రలో ఎంతో కాలం నుండి అమలు చేస్తున్న నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమానికి జైట్లీ ఈసారి ఎలాంటి కేటాయింపులు చేయకపోవటం గమనార్హం. తెలంగాణలోని ఒక నీటిపారుదల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని, మరో నీటిపారుదల ప్రాజెక్టును ఏఐబిపి కింద చేపట్టాలన్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం డిమాండ్‌ను కూడా జైట్లీ బేఖాతరు చేశారు. దీనితో ఆగ్రహం చెందిన టిఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభ వాయిదా పడిన అనంతరం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కలిసి తమ డిమాండ్ల గురించి కేవలం ప్రస్తావించి విజ్ఞప్తి చేసి వచ్చారే తప్ప తెలంగాణకు సరైన న్యాయం జరగలేదని గట్టిగా వాదించలేదని తెలిసింది.
తెలుగు రాష్ట్రాలలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధుల కేటాయింపునకు కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు.

బ్రాండెడ్ దుస్తులు
సాఫ్ట్‌డ్రింక్స్ ప్రియం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 29: ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం పార్లమెంటుకు సమర్పించిన 2016-17 ఆర్థిక సంవత్సరపు సాదారణ బడ్జెట్‌లో పన్నుల వ్యవస్థలో మార్పులు చేయడంతో ఇకపై కార్లు, స్థానికంగా తయారయ్యే మొబైల్ ఫోన్లు, బ్రాండెడ్ దుస్తులు, విమాన ప్రయాణం, సాఫ్ట్ డ్రింక్‌లు, మినరల్ వాటర్, సిగరెట్లు, స్మార్ట్ వాచీలులాంటివి మరింత ప్రియం కానున్నాయి. మరో వైపు పాదరక్షలు, సోలార్ లాంప్‌లు, రూటర్లు లాంటి కొన్ని వస్తువులు చౌక కానున్నాయి. అన్ని రకాల సేవలు, హోటళ్లు, రెస్టారెంట్లలో తినడం, థియేటర్లలో సినిమాలు చూడడం , బిల్లులు చెల్లించడంలాంటి కార్యకలాపాలపైన విధించనున్న కృషి కళ్యాణ్ సెస్ కారణంగా ఇవన్నీ కూడా మరింత దుబారా కానున్నాయి. ఇంతకు ముందున్న ఆర్థిక మంత్రుల బాటలోనే నడిచిన అరుణ్ జైట్లీ ధూమపానప్రియులు, పొగాకు వినియోగదారులపై భారీగానే భారం మోపారు.
పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని 15 శాతం వరకూ పెంచారు.
అయితే బీడీలపైన మాత్రం సుంకాన్ని పెంచడం లేదని జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.