జాతీయ వార్తలు

విదేశీ నిధులు మాకెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సంచలనాన్ని కలిగించి జెఎన్‌యు విద్యార్థుల అరెస్టుకు దారితీసిన కార్యక్రమ నిర్వహణకు అయిన ఖర్చు కేవలం వంద రూపాయలేనని విద్యార్థులు స్పష్టం చేశారు. జెఎన్‌యు క్యాంపస్‌లో జరిగే ఏ కార్యక్రమానికైనా అయ్యే ఖర్చు అతి తక్కువని, అంతేకాకుండా ఏ కార్యక్రమమైనా ఎలాంటి ప్రణాళిక లేకుండా గంట వ్యవధిలో నిర్వహించడం జరుగుతుందని జెఎన్‌యు స్టూడెంట్స్ యూనియన్ మాజీ ఉపాధ్యక్షుడు అనంత్ ప్రకాష్ నారాయణ్ పేర్కొన్నారు. దేశద్రోహ నేరం కింద కేసు నమోదైన విద్యార్థుల్లో అనంత్ కూడా ఒకరు. జాతి వ్యతిరేక కార్యక్రమంగా పేర్కొంటూ, విద్యార్థులకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు చేస్తూ, కార్యక్రమాల నిర్వహణకు విదేశీ నిధులు అందుతున్నాయంటూ ఎవరికి తోచినట్లు వారు వ్యాఖ్యానాలు చేస్తున్నారని అనంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కోర్టు హాల్లోనూ, టీవీ స్టూడియోల్లోనూ, మా పేర్లు మారుమోగిపోతున్నాయి. పార్లమెంటులో గొంతులు చించుకుంటున్నారు. యావద్దేశమంతా మమ్మల్ని ఉగ్రవాదులుగా చూస్తున్నారు. క్యాంపస్‌లో సర్వసాధారణంగా జరిగే కార్యక్రమాల గురించి వీరందరికి తెలిసింది చాలా తక్కువ’ అంటూ జెఎన్‌యు యూనియన్ మాజీ అధ్యక్షుడు అశుతోష్ కుమార్ అంటున్నారు. అఫ్జల్ గురు ఉదంతంపై చర్చ జరిపేందుకు మాకు ఏ ఉగ్రవాద సంస్థనుంచి నిధులు అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఏ యూనివర్శిటీకైనా అవసరమా అని అశుతోష్ ప్రశ్నించారు. ‘మేము విద్యార్థులం. చర్చించడం, ప్రశ్నించడం, అభిప్రాయాల్ని వ్యక్తపరచడమే మా ఉద్దేశం. దీన్ని ప్రభుత్వం, పోలీసులు భూతద్దంలో చూపిస్తున్నారని, దేశంలో ఉన్న అసహనానికి ఇదొక నిదర్శనమ’ని వ్యాఖ్యానించారు. కాగా, ఫిబ్రవరి 9వ తేదీన జరిగిన ఘటనకు బాధ్యులైన ఆరుగురు విద్యార్థుల్లో అనంత్, అశుతోష్ కూడా ఉన్నారు. వీరిద్దరూ పిహెచ్‌డి విద్యార్థులు. ఫిబ్రవరి 12 కన్హయ్య కుమార్‌ను అరెస్టు చేసిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన ఐదుగురిలో వీరిద్దరు కూడా ఉన్నారు. పది రోజుల అనంతరం క్యాంపస్‌కు విచ్చేసిన వీరిలో ఉమర్, అనిర్‌బన్ పోలీసులకు లొంగిపోగా మిగిలినవారు నిరాకరించారు. విచారణ అవసరమైనప్పుడు పోలీసులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామని వివరణ ఇచ్చుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న జెఎన్‌యు ఉద్యమాన్ని జెఎన్‌యు యూనియన్ ప్రస్తుత ఉపాధ్యక్షుడు షెహ్లా రషీద్ కలిసి నడుపుతున్నారు. ఈ ఆరుగురు విద్యార్థుల్ని యూనివర్శిటీ డిబార్ చేసినా, హాస్టల్‌లో గెస్టులుగా కొనసాగేందుకు అనుమతినిచ్చింది.

అనంత్ ప్రకాష్ నారాయణ్