జాతీయ వార్తలు

భారత కాన్సులేట్‌పై ఆత్మాహుతి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలాలాబాద్/ న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్ జలాలాబాద్‌లోని భారత కాన్సులేట్ కార్యాలయంపై బుధవారం మానవ బాంబులు, భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అఫ్గాన్ జాతీయ భద్రతా దళానికి (ఎఎన్‌పి)చెందిన జవాను సహా 9 మందిని కాల్చి చంపడంతో పాటు కార్యాలయానికి తీవ్రంగా నష్టం కలిగించారు. కాగా, 2007నుంచి జలాలాబాద్‌లోని భారత కాన్సులేట్‌పై ఉగ్రవాదులు దాడి చేయడం ఇది నాలుగోసారి.
కాన్సులేట్‌లోని భారతీయులంతా క్షేమమేనని, దాడికి పాల్పడిన ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారని న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఇద్దరు ఉగ్రవాదులు తమను తాము పేల్చేసుకోగా, మరో నలుగురు టెర్రరిస్టులను అఫ్గాన్ జాతీయ పోలీసులు కాల్చి చంపేసారు. ‘జలాలాబాద్‌లోని భారత కాన్సులేట్‌పై దాడి జరిగింది. కార్యాలయంలోని భారతీయులంతా క్షేమంగా ఉన్నారు. కాల్పుల్లో ఎఎన్‌పి అధికారి మృతిచెందాడు. ఒక మానవ బాంబు దౌత్య కార్యాలయం ముందు పేల్చేసుకోగా, మరో మానవ బాంబు టెర్రరిస్టులు వచ్చిన కారుతో సహా పేల్చేసుకున్నాడు. నలుగురు టెర్రరిస్టులను అఫ్గాన్ భద్రతా దళాలు కాల్చి చంపేసాయి’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ న్యూఢిల్లీలో విలేఖరులకు చెప్పారు. దాడిలో కాన్సులేట్ దెబ్బతిన్నదన్నారు. అఫ్గానిస్థాన్ సైన్యంనుంచి దాడికి సంబంధించిన ప్రాథమిక నివేదిక, తదుపరి పరిణామాల వివరాలు మంత్రిత్వ శాఖకు అందాయి. దాడి జరిగిన చోటునుంచి అందిన సమాచారాన్ని బట్టి మిలిటెంట్లకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో చిక్కి ఎనిమిది మంది పౌరులు చనిపోయినట్లు తెలుస్తోందని భారత భద్రతా దళ వర్గాలు తెలిపాయి. దాదాపు రెండు గంటల పాటు జరిగిన పోరు సందర్భంగా దాదాపు 1320 పేలుళ్లు సంభవించాయని, వీటిలో బాంబు పేలుళ్లు, గ్రెనేడ్ పేలుళ్లున్నాయని కూడా వారు తెలిపారు. మిలిటెంట్లు మొదట జరిపిన దాడిని ఇండో- టిబెటన్ సరిహద్దు పోలీసు ( ఐటిబిపి) తిప్పి కొట్టగా, తర్వాత ఆఫ్గాన్ సైన్యం వారితో చేరింది.
దాడికి పాల్పడిన మిగతా మిలిటెంట్లకు మార్గం సుగమం చేయడం కోసం ఒక మానవ బాంబు కాన్సులేట్ గేటు ముందు పేల్చేసుకుందని రాష్ట్ర పోలీసు చీఫ్ ఫాజల్ అహ్మద్ షిర్జాద్ చెప్పారు. మరో నలుగురు మిలిటెంట్లు భద్రతా దళాలతో అరగంట సేపు పోరాడిన అనంతరం హతమైనారని ఆయన చెప్పినట్లు ‘టోలో’ న్యూస్ చానల్ తెలిపింది. జలాలాబాద్‌లోని భారత కానస్సలేట్‌పై ఉగ్రవాద దాడి జరగడం ఇది నాలుగోసారి. ఇంతకు ముందు 2007లో ఒకసారి, ఆ తర్వాత 2013లో ఈ కార్యాలయంపై హ్యాండ్ గ్రెనేడ్ దాడులు జరగ్గా, 2013లో ముగ్గురు మానవ బాంబులు దాడి చేశాయి. 2015లో మరోసారి మిలిటెంట్లు దాడికి యత్నించగా, అఫ్గాన్ సైన్యాలు దాన్ని తిప్పి కొట్టాయి. కాగా, రెండు నెలల క్రితం భారీ ఆయుధాలు ధరించిన మిలిటెంట్లు మజర్-ఇ-షరీఫ్‌లోని భారత కాన్సులేట్‌పై దాడి చేయగా, దాదాపు 25 గంటల పోరు అనంతరం భవనంలోకి చొరబడిన మిలిటెంట్లందరినీ అఫ్గాన్ సైన్యాలు కాల్చి చంపాయి.ఈ దాడి జరిగిన వెంటనే జలాలాబాద్‌లోని పాక్ దౌత్యకార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు భారీ ఎత్తున తుపాకులు, బాంబులతో పెద్ద ఎత్తున దాడి చేశారు.

చిత్రం... మానవబాంబు పేలడంతో దెబ్బతిన్న
జలాలాబాద్‌లోని భారత కాన్సులేట్ భవనం