అంతర్జాతీయం

ఇండోనేసియాలో పెను భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పడాంగ్: ఇండోనేసియాలోని సుమత్రా దీవిని బుధవారం పెను భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 7.8పాయింట్ల తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం సునామీ హెచ్చరికలకూ దారితీయడంతో ప్రజలు బెంబేలెత్తి పోయారు. ఇళ్లను వదిలి వీధుల్లోకి పరుగులు పెట్టారు. భూకంప తీవ్రత దృష్ట్యా సునామీ సంభవించే అవకాశాలూ ఉన్నాయని హెచ్చరించిన అధికారులు కొన్ని గంటల తర్వాత వాటిని ఎత్తివేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో భయానక భూకంపాలు సంభవించి వేలాది మంది ప్రాణాలను బలిగొన్న నేపథ్యంలో తాజా సునామీ హెచ్చరికలు ప్రజల్ని బెంబేలెత్తించాయి. సముద్ర గర్భంలో 24కిలోమీటర్ల లోతులో భూకంగం 7.8పాయింట్ల తీవ్రతతో నమోదైందని అధికారులు తెలిపారు. దీని తీవ్రత ఎక్కువగానే ఉన్నప్పటికీ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదని అన్నారు. ఈ భూకంప మూల కేంద్రం మెంతావాయ్ దీవుల నుంచి పశ్చిమ సుమత్రా దీవి వరకూ వందలాది కిలోమీటర్లు విస్తరించడం వల్ల దీని తీవ్రత అనూహ్యంగానే ఉంటుందని భావించి సునామీ హెచ్చరికలు జారీ చేసినట్టు అధికారులు వివరించారు. పశ్చిమ సుమత్రాలలో పెద్ద పట్టణమైన పడాంగ్‌లోనే భూకంప తీవ్రత ఎక్కువగా నమోదైందని తెలిపారు. ఇళ్ల నుంచి బయటకి వచ్చిన ప్రజలు కార్లు, బైకులు, కాలి నడకన ఎగువ ప్రాంతాలకు పరుగులు తీయడం కనిపించిందని సాక్షులు తెలిపారు.

చిత్రం... భూకంపం సంభవించిన పెడాంగ్‌లో క్షతగాత్రుడిని
ఆస్పత్రికి తరలిస్తున్న బంధువు