జాతీయ వార్తలు

క్రికెట్ వ్యవహారాల్లో మంత్రుల అవసరం ఏమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: క్రికెట్‌కు సంబంధించిన వ్యవహారాల్లో మంత్రుల అవసరం ఏమిటని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)ని సుప్రీం కోర్టు నిలదీసింది. లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయడం కష్టమంటూ బిసిసిఐ దాఖలు చేసిన కౌంటర్‌పై ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్, న్యాయమూర్తి ఇబ్రహీం కలిఫుల్లాతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ స్పందించింది. బోర్డు కార్యవర్గంలో మంత్రులకు చోటు కల్పించవద్దని లోధా కమిటీ చేసిన సూచనను అమలు చేయడంలో నష్టం ఏముందని ప్రశ్నించింది. గత ఐదేళ్ల కాలంలో సభ్య సంఘాలకు చెల్లించిన మొత్తాల వివరాలను సమర్పించాలని ఆదేశించింది. కోట్ల రూపాయల లావాదేవీలను ఎవరి జోక్యం లేకుండా మీరే స్వతంత్రంగా చూసుకోవాలని అనుకుంటున్నారా? అని అడిగింది. విశ్రాంత న్యాయమూర్తి లోధా నేతృత్వంలో, అశోక్ భాన్, ఆర్‌వి రవీంద్రన్ సభ్యులుగా ఉన్న కమిటీ తన నివేదికలో చేసిన సిఫార్సులను అమలు చేయాలని గత నెల నాలుగో తేదీన బిసిసిఐని సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.