అంతర్జాతీయం

ట్రంప్ గుదిబండే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 3: అమెరికా ప్రజల ఆదరణను విశేషంగా చూరగొంటూ మహా మంగళవారంలోనూ విజేతగా నిలిచిన రియల్ ఎస్టేట్ మొనార్క్ డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అధినేతలకు గుదిబండగా మారారు! అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి ఏ పార్టీ నామినేషన్ కోసమైతే ట్రంప్ పోటీ పడుతున్నారో ఆ పార్టీ అధినాయకత్వమే ఆయన పాపులారిటీకి బెంబేలెత్తి పోవడం గందరగోళానికి దారితీస్తోంది. ట్రంప్‌కు వ్యతిరేకంగా రిపబ్లికన్ పార్టీ అధినేతలే చేతులు కలిపారంటే ఆయన ఎదుగుదల ఎంతగా వారిని బెంబేలెత్తిస్తోందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ పదిహేను రాష్ట్రాల్లో ప్రైమరీలు పూర్తయ్యాయి. పది రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ రిపబ్లికన్ అభ్యర్థిగా నామినేషన్ దక్కకుండా పార్టీ అధినేతలు పావులు కదుపుతున్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి మొదలైన అన్ని ప్రైమరీల్లోనూ ట్రంప్ విజయం సాధిస్తూ రావడం, వాగ్ధాటి, పలుకుబడి నానాటికీ పెరగడం రిపబ్లికన్ నాయకత్వానికి మింగుడు పడనిదిగా మారింది. పార్టీ తరపున పోటీ పడుతున్న ఇతర అభ్యర్ధుల కంటే కూడా డొనాల్డ్ ట్రంప్ నిర్వహిస్తున్న ర్యాలీలకు వేల సంఖ్యలోనే ప్రజలు హాజరవుతున్నారు. సూపర్ ట్యూస్‌డే తర్వాత ట్రంప్‌కు 319మంది డెలిగేట్ల మద్దతు లభించింది. ఆయనతో పోటీ పడుతున్న టెడ్ క్రజ్‌కు 226మంది, మార్కో రూబియోకు 110మంది మద్దతే ఉంది. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు నామినేషన్ లభించాలంటే మొత్తం 2472మంది డెలిగేట్లలో ట్రంప్‌కు 1237మంది మద్దతు అవసరం అవుతుంది. ఇంకా ఆయనకు 918మంది మద్దతు అవసరమని, ప్రస్తుతం వీర విహారం చేస్తున్న ఆయన జనాకర్షక శక్తిని బట్టి చూస్తే ఇంత మంది మద్దతు అసాధ్యమేమీ కాదని విశే్లషకులు చెబుతున్నారు. శనివారం కాన్సాస్, కెంటుకి, లూసియానా,మైన్ రాష్ట్రాల్లో శనివారం ప్రైమరీలు జరుగుతాయి. ఇప్పటికే వీటిలో మూడు రాష్ట్రాల్లో ట్రంప్‌దే ఆధిక్యత కొనసాగుతోంది. ఈ ప్రైమరీల్లోనూ ట్రంప్ విజేతగా నిలిస్తే..దేశాధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ నామినేషన్ పోందేందుకు ఆయన మరింత చేరుక కావడం ఖాయం. ఈ పరిస్థితి రిపబ్లికన్ అధినాయకత్వానికే కాదు వైట్ హౌస్‌కు కూడా దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ముఖ్యంగా ఎన్నికల సభల్లో ట్రంప్ చేస్తున్న ప్రసంగాలు, వ్యాఖ్యలూ దశాబ్దాలుగా రిపబ్లికన్ పార్టీ పెంచి పోషించుకుంటూ వస్తున్న విలువలకు విఘాతకరంగా పరిణమిస్తున్నాయి.